ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగమనేని ఆశయాలు కొనసాగించాలి

ABN, First Publish Date - 2021-03-01T06:30:20+05:30

సీనియర్‌ సాహితీవేత్త, అభ్యుదయ రచయిత, ప్రజాతంత్రవాది, రైతుపక్షపాతి సింగమనేని నారాయణ ఆశయాలను కొనసాగించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంస్మరణ సభలో వక్తలు..  జిరసం ఆధ్వర్యంలో ఘనంగా నివాళి

అనంతపురం టౌన, ఫిబ్రవరి 28: సీనియర్‌ సాహితీవేత్త, అభ్యుదయ రచయిత, ప్రజాతంత్రవాది, రైతుపక్షపాతి సింగమనేని నారాయణ ఆశయాలను కొనసాగించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. జిరసం(జిల్లా రచయితల సంఘం) ఆధ్వర్యంలో సింగమనేని నారాయణ సంతాపసభను ఆదివారం సాయంత్రం స్థానిక లిటిల్‌ఫ్లవర్‌ స్కూల్‌లో నిర్వహించారు. డాక్టర్‌ పతికి రమేష్‌ నారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభకు  కేంద్ర సాహి త్య అకాడమీ సాధారణమండలి సభ్యుడు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్‌ రచయితలు బండి నా రాయణస్వామి, శాంతినారాయణ, ఆచార్య పీఎల్‌ శ్రీనివాసరెడ్డి, బూదాటి వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. తొలుత సింగమనేని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సింగమనేని మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌ నం పాటించారు. ఈసందర్భంగా ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడు తూ... అనేక ప్రజా ఉద్యమాలలో సింగమనేని స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగారన్నారు. జిరసం కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణలో కీలకపాత్ర పోషించాడన్నారు.  రాయలసీమ సమస్యలు, నీటి అవసరాలు, వాటిని తీర్చుకునే మార్గాలపై సింగమనేనికి సంపూర్ణ అవగాహన ఉండేదని గుర్తుచేశారు. జిరసం ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన కరువు అధ్యయన యాత్ర, రైతు ఆత్మవిశ్వాసయాత్ర, వలస కుటుంబాల పిల్లలు, వృద్ధులకు గంజికేంద్రాల నిర్వహణలోనూ చురుకైన పాత్ర పోషించారని, కలం-కాగితాలకే పరిమితమవకుండా ప్రజారచయితగా నిలిచాడన్నారు.  సింగమనేని స్ఫూర్తితో నేటితరం రచయితలు స్పష్టమైన ప్రాపంచిక దృక్పథాన్ని, సామాజిక చింతనను కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో మానవహక్కుల వేదిక కన్వీనర్‌ చంద్రశేఖర్‌, అనంత సాహితీ ప్రస్తానం ట్రస్టు చైర్మన గంగిరెడ్డి అశ్వత్థరెడ్డి, సీనియర్‌ రచయితలు రాధేయ, తరిమెల అమర్‌నాథరెడ్డి, జెట్టి జైరాం, కంబదూరి షేక్‌ నబీరసూల్‌, నారాయణ, అప్పిరెడ్డి హరినాథరెడ్డి, రియాజుద్దీన, జూటూరు షరీఫ్‌, బాలగొండ ఆంజనేయులు, జెన్నె ఆనంద్‌కుమార్‌, చిలుకూరి దీవెన, కటకం కృష్ణవేణి, ఎల్‌ఆర్‌ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-01T06:30:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising