ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంజయ్‌ ప్రభాకర్‌ సేవలు అమోఘం

ABN, First Publish Date - 2021-05-11T06:01:22+05:30

బీసీ సంక్షేమశాఖలో జిల్లాలో పనిచేసిన సమయంలో బీసీ వర్గాలకు సంజయ్‌ప్రభాకర్‌ చేసిన సేవలు అమోఘమని ఆ శాఖ జి ల్లా డీడీ యుగంధర్‌ కొనియాడారు.

బీసీ సంక్షేమశాఖ డీడీ యుగంధర్‌, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సంజయ్‌ప్రభాకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పిస్తున్న 

అనంతపురం క్లాక్‌టవర్‌, మే 10 : బీసీ సంక్షేమశాఖలో జిల్లాలో పనిచేసిన సమయంలో బీసీ వర్గాలకు సంజయ్‌ప్రభాకర్‌ చేసిన సేవలు అమోఘమని ఆ శాఖ జి ల్లా డీడీ యుగంధర్‌ కొనియాడారు. కరోనాతో మృతి చెందిన బీసీ సంక్షేమశాఖ రాష్ట్ర అ దనపు డైరెక్టర్‌, ఏపీ రాష్ట్ర ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన ఎండీ సంజయ్‌ప్రభాకర్‌ సంతా పసభను సోమవారం స్థానిక రుద్రంపేటలోని బీసీ సంక్షేమశాఖ కార్యాలయంలో నిర్వ హించారు. సంజయ్‌ప్రభాకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ సలహాలు, సూచనలు చేస్తూ ఉద్యోగులను వెన్నంటి ప్రోత్సాహించే వ్యక్తి అని గుర్తుచేశారు. సంజయ్‌ప్రభాకర్‌ మృతి బీసీ సం క్షేమశాఖకు, ఉద్యోగులకు తీరని లోటన్నారు. కార్యక్ర మంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి (డీబీసీడబ్ల్యూఓ) నరసయ్య, సూపరిం టెండెంట్‌ శ్రీనివాసులు, శ్రీధర్‌, విజయరా జు, గాయత్రి, దివ్య, రాణి, వేణు, జయ రాజ్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-11T06:01:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising