ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధిపై సమీక్షా..? ... అధికార పార్టీ సమావేశమా..?

ABN, First Publish Date - 2021-12-31T05:48:47+05:30

స్థానిక వెలుగు కార్యాలయంలో గురువారం ఎంపీపీ వెంకటరత్నం ఆదేశాల మే రకు మండలంలోని సచివాలయసిబ్బంది, ప్రజాప్రతినిధులకు సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశంలో వైసీపీ మండల కన్వీనర్‌ (వృత్తంలోని వ్యక్తి)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులతోపాటు ఆశీనులై సచివాలయ సిబ్బందికి

సలహాలు, సూచనలు జారీ చేసిన నాయకులు

లేపాక్షి, డిసెంబరు 30: స్థానిక వెలుగు కార్యాలయంలో గురువారం ఎంపీపీ వెంకటరత్నం ఆదేశాల మే రకు మండలంలోని సచివాలయసిబ్బంది, ప్రజాప్రతినిధులకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు తప్పక హాజరు కావాలని ఎంపీడీఓ నరసింహనాయుడు ప్రకటన విడుదల చేశారు. దీంతో మండల వ్యాప్తంగా  ఉన్న సచివాలయాలు 2గంటలకే మూసివేసి వెలుగు కార్యాలయానికి సిబ్బంది, అధికారులు చేరుకున్నారు. అయితే సమావేశం అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరిగింది. సచివాలయ సిబ్బందికి అధికార పార్టీ నాయకులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎటువంటి అధికారం లేకపోయినా అధికారుల మధ్యన మండల కన్వీనర్‌ నారాయణస్వామి కూర్చొని తనదైన శైలిలో సిబ్బందికి సూచనలు ఇచ్చారు. దీన్ని ఖండించాల్సిన అధికారులు ఆయనకు స్వాగతం పలికి ఆయన సూచనలను అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో సచివాలయ సిబ్బంది అయోమయంలో పడ్డారు. తాము ప్రభుత్వ ఉద్యోగులమా లేక పార్టీ కార్యకర్తలమా అంటూ గుసగుసలాడుకున్నారు. చేసేది లేక తలూపుకుంటూ సమావేశాన్నికానిచ్చేశారు. 


Updated Date - 2021-12-31T05:48:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising