ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్పత్రిలో మీడియాపై మళ్లీ ఆంక్షలు

ABN, First Publish Date - 2021-05-11T06:38:30+05:30

జి ల్లా సర్వజనాస్పత్రిలో మళ్లీ మీడియాపై పో లీసులు ఆంక్షలు పె ట్టారు. సోమవారం మామూలుగానే మీ డియా ప్రతినిధులు కవరేజీ నిమిత్తం ఆ స్పత్రికెళ్లారు

మీడియాకు అనుమతి లేదని ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి వీడియోగ్రాఫర్‌ను బయటకు తీసుకొస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



తప్పుబట్టిన జర్నలిస్టులు, ప్రతిపక్షాలు


 అనంతపురం వై ద్యం, మే10: జి ల్లా సర్వజనాస్పత్రిలో మళ్లీ మీడియాపై పో లీసులు ఆంక్షలు పె ట్టారు. సోమవారం మామూలుగానే మీ డియా ప్రతినిధులు కవరేజీ నిమిత్తం ఆ స్పత్రికెళ్లారు. అప్పటి కే పలువురు పోలీసు లు ఆస్పత్రి ప్రధాన గేట్‌ వద్ద పహారా కాస్తూ ఉండిపోయారు. మీడియా ప్రతినిధులను లోపలికి పంపకుండా అడ్డుకున్నారు. లోపలికెళ్లిన ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి వీడియోగ్రాఫర్‌ను పోలీసులు వెళ్లి, బయటకు తీసుకొచ్చారు. కలెక్టర్‌ ఎలాంటి ఆంక్షలు లేవని ప్రకటన ఇచ్చారనీ, ఆ వీడియో గ్రాఫర్‌ చూపించినా పోలీసులు పట్టించుకోలేదు. మీడియాను లోపలికి పంపవద్దని తమకు ఆదేశాలున్నాయని చెప్పుకొచ్చారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి వీడియోగ్రాఫర్‌ను వెనక్కి పంపారు. ఉన్నతాధికారుల తీరును జర్నలిస్టులు, ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. కరోనాను నియంత్రించాల్సిందిపోయి ప్రాణాలకు తెగించి, కరోనా బాధితులకు అందుతున్న సేవలతోపాటు వారు పడుతున్న కష్టాలను అధికారుల దృష్టికి తీసుకొస్తున్న మీడియాకు ఆంక్షలు పెట్టడం ఏంటని మండిపడ్డారు. కలెక్టర్‌, ఎస్పీలు పునరాలోచించాలని జర్నలిస్టులు డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-05-11T06:38:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising