ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ సమగ్రతను కాపాడాలి: జేసీ సిరి

ABN, First Publish Date - 2021-01-27T06:46:56+05:30

జాతీయ సమగ్రతను కాపాడాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి పేర్కొన్నారు. జిల్లా సాంస్కృతిక మండలి ఆ ధ్వర్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక లలిత కళాపరిషత్‌లో 72వ గణతంత్ర దినోత్సవాన్ని పు రస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక సంబ రాలు అలరించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘనంగా గణతంత్ర సాంస్కృతిక సంబరాలు

అనంతపురం టౌన్‌, జనవరి 26: జాతీయ సమగ్రతను కాపాడాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి పేర్కొన్నారు. జిల్లా సాంస్కృతిక మండలి ఆ ధ్వర్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక లలిత కళాపరిషత్‌లో 72వ గణతంత్ర దినోత్సవాన్ని పు రస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక సంబ రాలు అలరించాయి. సమాచారశాఖ ఏడీ జయమ్మ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి జేసీలు సిరి, గంగాధర్‌గౌడ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్య ముఖ్యఅతిథులుగా హాజరై, సాంస్కృతిక సంబరాలను ప్రారంభించారు. మొదటిగా శ్రీనృత్యకళానిలయం చిన్నారులు సంప్రదాయ కూచిపూడి నృ త్య రూపకం ప్రదర్శించారు. అనంతరం కంబదూరు కేజీబీవీ విద్యార్థులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, కళాసాగర్‌ డ్యాన్స్‌ అకాడమీ, మక్బూల్‌ డ్యాన్స్‌ అకాడమీల చిన్నారులు దేశభక్తి గీతాలకు నృత్యాలతో అ లరించారు. గురుకృప నృత్యకళానికేతన్‌, కూచిపూడి కళాకేంద్రం చిన్నారుల సంప్రదాయ కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. గార్లదిన్నె కేజీబీవీ వి ద్యార్థులు, వినాయక నృత్యకళానికేతన్‌ చిన్నారుల జానపద నృత్యప్రదర్శన, యూత్‌వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కళాకారులు జాతీయ సమైక్యత, మత సామరస్యంపై నృత్యప్రదర్శన ఆ కట్టుకున్నాయి. ఆయా చిన్నారులకు ముఖ్యఅతిథుల చేతులమీదుగా జ్ఞాపికలు అందజేశారు. కార్యక్ర మంలో ఆర్డీఓ గుణభూషణ్‌రెడ్డి, తహసీల్దార్లు అ నుపమ, లక్ష్మీనారాయణ, ఎల్‌కేపీ కార్యదర్శి పద్మజ, సమాచార శాఖ డివిజనల్‌ పీఆర్‌ఓ రమేష్‌, డీఈ నాగభూషణం, ఏపీఆర్‌ఓ ఫకృద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T06:46:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising