ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

ABN, First Publish Date - 2021-01-26T07:02:27+05:30

గణతంత్ర వేడుకలకు నగరంలోని పోలీసు పరేడ్‌ మైదానం ముస్తాబైంది. ఈనెల 26న మంగళవారం నిర్వహించే కార్యక్రమానికి సంబంధించి సాయుధ బలగాలు సోమవారం పలు రకాల రిహార్సల్స్‌ చేశా యి. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు చెందిన స్టాళ్లను ఆయా శాఖల ఉద్యోగులు ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముస్తాబైన పోలీస్‌ పరేడ్‌ మైదానం ...

ఏర్పాట్లను పర్యవేక్షించిన రెవెన్యూ, పోలీసు అధికారులు

అనంతపురం క్రైం, జనవరి 25 :  గణతంత్ర  వేడుకలకు నగరంలోని పోలీసు పరేడ్‌ మైదానం ముస్తాబైంది. ఈనెల 26న మంగళవారం నిర్వహించే కార్యక్రమానికి సంబంధించి సాయుధ బలగాలు సోమవారం పలు రకాల రిహార్సల్స్‌ చేశా యి. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు చెందిన స్టాళ్లను ఆయా శాఖల ఉద్యోగులు ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజలు, గణతంత్ర వేడుకలు వీక్షించేందుకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేరువేరుగా ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ విధుల్లో చూపిన ప్రతిభను గుర్తించి  ప్రశంసాపత్రాలు అందజేయనున్నా రు. గణతంత్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన పలువురు అధికారులు సోమవారం సాయంత్రం పరిశీలించారు. కాగా గణతంత్ర దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఓ ప్రకటనలో కోరారు. 


 గణతంత్ర వేడుకల్లో కార్యక్రమాలు ఇలా...

- ఉదయం 9గంటలకు జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆవిష్కరించి, గౌరవ వందనం చేస్తారు. 

- ఉదయం 9.05 గంటలకు పరేడ్‌ను పరిశీలిస్తారు. 

- ఉదయం 9.20 గంటలకు జిల్లా ప్రగతి నివేదికను కలెక్టర్‌ చదివి వినిపిస్తారు.

- ఉదయం 10 గంటలకు వివిధ రకాల శకటాల ప్రదర్శన

- ఉదయం 10.25 గంటలకు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు

- ఉదయం 11.20 గంటలకు ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేత

- 12.00 గంటలకు వివిధ రకాల స్టాల్స్‌ సందర్శన

- సాయంత్రం 6 గంటలకు నగరంలోని లలిత కళాపరిషత్‌లో జాతీయ సమైక్యతపై సాంస్కృతిక కార్య క్రమాలు



Updated Date - 2021-01-26T07:02:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising