ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడిపై అవగాహన కల్పించండి

ABN, First Publish Date - 2021-05-20T05:54:13+05:30

రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్‌ కట్టడికి ప్రజలకు విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని సబ్‌ కలెక్టర్‌ నిషాంతి పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ నిషాంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులకు సబ్‌ కలెక్టర్‌ నిషాంతి ఆదేశం

పెనుకొండ, మే 19: రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్‌ కట్టడికి ప్రజలకు విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని సబ్‌ కలెక్టర్‌ నిషాంతి పేర్కొన్నారు. స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో డివిజనల్‌ అధికారులు, సిబ్బందిపై కొవిడ్‌నియంత్రణపై తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ పోలీసులు లాక్‌డౌనను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. హోటళ్లు, బ్యాంకులు, జనసముహం ఉన్న ప్రాంతాల్లో గుంపులుగా ఉండకుండా చూడాలన్నారు. రోగాలకు సంబంధించి ఇంటింటి సర్వే పక్కాగా ఉండాలన్నారు. ఉపాధ్యాయులను ప్రజల్లో అవగాహన కల్పించడానికి విధులుకేటాయించామన్నారు. వారి విలువైన సేవలను సమాజానికి ఉపయోగపడేలా చేయాలన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత తక్కువగా ఉండటంవల్లే కరోనాపై ప్రజల్లో అవగాహన కొరవడిందన్నారు. ఉపాధ్యాయుల సేవలతో వీరిలో  మార్పు వస్తుందన్నారు. కేరళలో అక్షరాస్యత అధికంగా ఉండటంవల్లే వారు జాగ్రత్తలు పాటించి కరోనాకు అడ్డుకట్ట వేయగలిగారన్నారు. అధికారులు మరింత బాధ్యతతో విధులునిర్వహించి కరోనా కట్టడికి కృషిచేయాలన్నారు. కరోనాపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, రోగనివారణకు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు.


Updated Date - 2021-05-20T05:54:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising