ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యంత్రాలతో పప్పుశనగ పంటకోతలు

ABN, First Publish Date - 2021-01-17T05:58:49+05:30

మండల రైతుల పప్పుశనగ పంట కోతలకు ఆధునిక యం త్రాలు అందుబాటులోకి వచ్చాయి. పంటను ఇంటికి తెచ్చుకోవాలంటే రైతులు నానా అవస్థలు పడేవారు.

ఆధునిక యంత్రంతో పప్పుశనగ పంట కోతలు చేపడుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెళుగుప్ప, జనవరి 16: మండల రైతుల పప్పుశనగ పంట కోతలకు ఆధునిక యం త్రాలు అందుబాటులోకి వచ్చాయి. పంటను ఇంటికి తెచ్చుకోవాలంటే రైతులు నానా అవస్థలు పడేవారు. ఒకేసారి పంటకోతకు రావడంతో తొలగించేందుకు కూలీల సమస్య వెం టాడుతుండేది. పక్క మండలాల నుంచి కూలీలలను పిలుచుకువచ్చి పంట తొలగించుకునేవారు. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి ఆధునిక యంత్రాలు స్థానికంగా అందుబాటులోకి రావడంతో పప్పుశనగ రైతుకు ఊరట లభించింది. ఒక్కో కూలీకి రూ.300 చెల్లిస్తున్నా కూ లీలు దొరకడంలేదు. వర్షాలు బాగా కురవటంతో పైరు ఏపుగా పెరిగింది. ఎకరం పంటను తొలగించేందుకు 5 నుంచి 6 మంది కూలీలు కావాల్సి వస్తోంది. ప్రస్తుతం మిషన ద్వారా పంట కోతలకు ఎకరాకు రూ.1800ల మేర బాడుగ చెల్లిస్తున్నారు. దీని ద్వారా పొలాల నుంచి ధాన్యాన్ని నేరుగా ఇంటికి తెచ్చుకునేందకు వీలుగా ఉంది. దీంతో ఎక్కువ మంది రైతులు ఆధునికయంత్రాలపై ఆసక్తి చూపుతున్నారు. కాగా ఈయంత్రాలు రైతులకు ఊరటనిస్తున్నా కూలీలకు మాత్రం నిరాశే మిగిలిస్తోంది.


Updated Date - 2021-01-17T05:58:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising