ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎఫ్‌పీ షాపు డీలర్ల నిరసన బాట

ABN, First Publish Date - 2021-10-27T06:20:04+05:30

గోనెసంచులను డీలర్లు తిరిగి ఉచితంగా ఇవ్వాలన్న ప్రభు త్వం నిర్ణయంపై ఎఫ్‌పీ షాపు డీలర్ల నిరసన బాట పట్టారు.

నిరసన వ్యక్తం చేస్తున్న ఎఫ్‌పీ షాపు డీలర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గోనె సంచులకు డబ్బు చెల్లించాలని డిమాండ్‌ 

అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 26: గోనెసంచులను డీలర్లు తిరిగి ఉచితంగా ఇవ్వాలన్న ప్రభు త్వం నిర్ణయంపై ఎఫ్‌పీ షాపు డీలర్ల నిరసన బాట పట్టారు. ఎఫ్‌పీ షాపు డీలర్ల సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండల స్థాయి స్టాక్‌ పాయింట్ల వద్ద ఖాళీ గోనె సంచులతో మంగళవారం ఎఫ్‌పీ షాప్‌ డీలర్లు ధర్నా నిర్వహించారు. బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు తీసుకోకుండా నిరసన తెలియజేశారు. దీంతో ఎఫ్‌పీ షాపులకు నవంబరు నెలకు సంబంధించిన  నిత్యావసర సరుకుల సరఫరా బంద్‌ అయ్యింది. అనంతపురం అర్బన, రూరల్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద ఎఫ్‌పీ షాపు డీలర్ల సంఘం నాయకులు బాలనాగిరెడ్డి, లాలప్ప, చంద్రశేఖర్‌, బాలకృష్ణ, తిరుపాల్‌ తదితరులు నిరసన వ్యక్తం చేశారు. మిగతా ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద ఆయా స్థానిక ఎఫ్‌పీ షాపు డీలర్లు నిరసన వ్యక్తం చేశారు.  ఇదివరకు ఎఫ్‌పీ షాపుల నుంచి గోనె సంచులను ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు తిరిగి పంపే వారన్నారని, ఒక్కో గోనె సంచికి రూ.20లు ప్రభుత్వం అందిస్తూ వచ్చిందని అన్నారు. ఇప్పటి నుంచి ఉచితంగా గోనె సంచులు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం జీఓ జారీ చేసిందని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


Updated Date - 2021-10-27T06:20:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising