ఖైదీ మృతదేహానికి పోస్టుమార్టం
ABN, First Publish Date - 2021-08-25T06:34:40+05:30
పట్టణంలోని సబ్‌జైలులో గుండెపోటుతో మృతి చెందిన రిమాండ్ ఖైదీ తలారి ఓబులప్ప (67) మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు.
పోలీసులతో చర్చిస్తున్న ఆర్డీఓ మధుసూదన
గుత్తి, ఆగస్టు 24: పట్టణంలోని సబ్‌జైలులో గుండెపోటుతో మృతి చెందిన రిమాండ్ ఖైదీ తలారి ఓబులప్ప (67) మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. సోమవారం రాత్రి సబ్‌జైలులో ఓబులప్ప గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిం దే. ఉదయం ఆర్డీఓ మధుసూదన, తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తహసీల్దారు హాజీవలి, సీఐ రాము, వీఆర్వోలు పాల్గొన్నారు.
Updated Date - 2021-08-25T06:34:40+05:30 IST