ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపట్నుంటి పోలీసు అమరవీరుల వారోత్సవాలు : ఎస్పీ

ABN, First Publish Date - 2021-10-20T06:24:35+05:30

పోలీసు అమరవీరుల వారోత్సవాలను ఈ నెల 21 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నామని, వాటిని విజయవంతం చేయాలని ఎస్పీ డాక్టర్‌ కాగినెల్లి ఫక్కీరప్ప మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం క్రైం, అక్టోబరు 19 : పోలీసు అమరవీరుల వారోత్సవాలను ఈ నెల 21 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నామని, వాటిని విజయవంతం చేయాలని ఎస్పీ డాక్టర్‌ కాగినెల్లి ఫక్కీరప్ప మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. విధి నిర్వహణలో అసువులు బాసిన అమర పోలీసులను గుర్తు చేసుకోవడంతో పాటు సమాజంలో పోలీసు పాత్ర, విధులు, త్యాగాలు తదితర అంశాలపై ప్రజలకు ఈ వారోత్సవాల్లో అవగాహన కల్పించాలని ఆయా ప్రాంతాల పోలీసులను ఆదేశించారు. 1959 అక్టోబరు 21న భారతకు చెందిన సీఆర్‌ పీఎఫ్‌ జవానలపై చైనా సైనికులు పెద్దఎత్తున బలగాలతో దాడి చేశారని,  భారత సీఆర్‌ పీఎఫ్‌ సిబ్బంది తక్కువుగా ఉన్నప్పటీకి ఏమాత్రం జంకకుండా ఎదురుదాడికి దిగి దేశం కోసం ప్రాణాలు అర్పించారని, దీంతో ఏటా అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నామని తెలిపారు. కాగా, ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల పోలీసుల నేతృత్వంలో వైద్య శిబిరాలు, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులకు సన్మానం తదితర వాటినీ నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2021-10-20T06:24:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising