ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెన్నహోబిలం దేవస్థానం భూముల వేలం పాట రద్దు చేయాలి

ABN, First Publish Date - 2021-05-26T06:17:51+05:30

పెన్నహోబిలం దేవస్థానం భూముల వేలం పాటను రద్దుపరిచి, ప్రస్తుతం సాగులో ఉన్న కౌలు రైతులనే కొనసాగించాలని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ చే శారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాగులో ఉన్న కౌలు రైతులనే కొనసాగించాలి

ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌


ఉరవకొండ, మే 25: పెన్నహోబిలం దేవస్థానం భూముల వేలం పాటను రద్దుపరిచి, ప్రస్తుతం సాగులో ఉన్న కౌలు రైతులనే కొనసాగించాలని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ చే శారు. మంగళవారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ 25 సంవత్సరాల నుంచి 750 మందికి పైగా రైతు కుటుంబాలు దేవస్థానం భూముల గుత్తను పెంచుతూ రెన్యువల్‌ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. అలాంటి నిరుపేద రైతు కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేస్తూ, వారిని ఉన్న ఫలంగా వేలం పాట పేరుతో వేదించ డం సరైంది కాదన్నారు. తీవ్ర కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇబ్బందుల్లో ఉన్నారని, దేవాలయ భూములను కౌలుకు తీసుకున్న పేద రైతులపై వేలం పాట పేరుతో వేధించడం స రికాదన్నారు. దీనిని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితులలో పేదలకు తోడుగా ఉండాల్సింది పోయి, రాజకీయ కుట్రతో రైతులను ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమన్నారు. కరోనా పరిస్థితులలో వేలాలు నిర్వహించడం నిషేధమని తెలిసినా వే లాలు నిర్వహించాలని నిర్ణయించడం వల్ల పేద రైతు కుటుంబాలలో ఆందోళన నెలకొందన్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న కౌలు రైతులకు గుత్తలు పెంచి కొనసాగించాలన్నారు. 

Updated Date - 2021-05-26T06:17:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising