ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు పరిటాల రవీంద్ర వర్ధంతి

ABN, First Publish Date - 2021-01-24T06:59:18+05:30

మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 16వ వర్ధంతిని వెంకటాపురం గ్రామంలో ఆదివారం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏర్పాట్లు పూర్తి

రామగిరి, జనవరి 23: మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 16వ వర్ధంతిని వెంకటాపురం గ్రామంలో ఆదివారం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌, కుటుంబసభ్యులు అభి మానులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు పరిటాల రవీంద్ర కుటుంబసభ్యులు పరిటాల ఘాట్‌కు నివాళులర్పిస్తారు. కాగా వర్ధంతికి తరలివచ్చే అభిమానులు, నాయకులు, కార్యకర్తలకు భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. అభిమానులు ఎంతమంది వచ్చిన ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు. శనివారం మద్యాహ్నమే భోజన ఏర్పాట్లను పరిటాల సునీత ప్రారంభించారు. ఇప్పటికే అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చి పనుల్లో నిమగ్నమయ్యారు. పరిటాల రవీంద్ర వర్ధంతికి రాష్ట్ర నలుమూలల నుంచే కాక కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా అభిమానులు తరలిరానున్నారు. కార్యక్రమానికి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పలువురు నా యకులు తరలిరానున్నారు. పరిటాల రవీంద్ర ఘాట్‌ను వివిధ రకాల పూలతో అలంకరించారు. పరిటాల సునీ త మాట్లాడుతూ అభిమానులు ఎవరికి వారే స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పలు ప్రాంతాల నుంచి అభిమానులు వర్ధంతి ఏర్పాట్లపై అడిగి, తెలుసుకున్నారన్నారు. పెద్దఎత్తున తరలి వస్తారనీ, ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె తెలిపారు.




Updated Date - 2021-01-24T06:59:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising