ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెగని ఇంటి పట్టాల పంచాయితీ

ABN, First Publish Date - 2021-04-18T06:20:59+05:30

ఉరవకొండ మేజరు పంచాయతీలో ఇంటి పట్టాల పంపిణీ ఏళ్లకాలంగా కొలిక్కిరావడం లేదు. ఇప్పట్లో మోక్షం కలిగే పరిస్థితులు కూడా కనబడటం లేదు.

టీడీపీ హయాంలో సేకరించిన భూమిలో లేఅవుట్లు వేసిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పటికే రెండుసార్లు పంపిణీ వాయిదా

అయోమయంలో లబ్ధిదారులు


 ఉరవకొండ, ఏప్రిల్‌ 17: ఉరవకొండ మేజరు పంచాయతీలో ఇంటి పట్టాల పంపిణీ ఏళ్లకాలంగా కొలిక్కిరావడం లేదు. ఇప్పట్లో మోక్షం కలిగే పరిస్థితులు కూడా కనబడటం లేదు. నవరత్నాలు పథకం కింద 870 మం ది లబ్ధిదారులను ఇంటి పట్టాల పంపిణీకి ఎంపిక చేశారు. వాటిలో అనర్హులు ఉన్నారన్న ఫిర్యాదుతో విచారణ చేపట్టాలని వామపక్ష పార్టీ నాయకులు అప్పట్లో తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టి 140 మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా పేదలందరికి ఇళ్ల పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ప ట్టాలు పంపిణీ చేసినా ఉరవకొండలో మాత్రం రెండుసార్లు పట్టాల పంపిణీ వాయిదా పడింది. జనవరి 7న పట్టాల పంపిణీ చేయాల్సి ఉండగా అర్ధంతరంగా వాయిదా వేశారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అదే నెల 20వ తేదీ వ రకు పొడిగించగా, పట్టాల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులు పెద్దసంఖ్యలో పట్టాలు అందుకునేందుకు వచ్చారు. నవరత్నా ల పథకం కింద మాత్రమే పట్టాలు పంపిణీ చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భావనతోనే ఉన్నతాధికారుల ఆదేశాలతో మళ్లీ వాయిదా వే శారు. దీంతో లబ్ధిదారులు నిరాశగా వెనుదిరిగి పోయారు.

    పంచాయతీ ఎన్నికల సందర్భంలో తమ మద్దతుదారులను గెలిపిస్తే మార్చి నెలాఖరులోపు పట్టాలు పంపిణీ చేస్తామని అధికారపార్టీ నాయకులు హామీ ఇచ్చారు. మార్చి నెల దాటినా పట్టాల పంపిణీ ఊసేలేదు. దీంతో లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

 

 ఇచ్చిన పట్టాలకు హద్దులు చూపని వైనం

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2019లో 88 ఎకరాల్లో 3086 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. రెండేళ్లవుతున్నా ఇప్పటి దా కా హద్దులు చూపించలేదు. అనర్హులున్నారని వైసీపీ నాయకులు జిల్లా అ ధికారులకు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో ధర్డ్‌ పార్టీ విచారణ చేపట్టి 247 మందిని అనర్హులుగా గుర్తించారు. లేఅవుట్ల ప్రక్రియ పూర్తయినా.. ఇందిర మ్మ పథకం కింద భూములిచ్చిన రైతులు తమకు పరిహారం తక్కువ ఇచ్చారని, ప్రస్తుతం పరిహారం పెంచి ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు. దీంతో కథ అడ్డం తిరిగి ఇళ్ల స్థలాల పంపిణీ మళ్లీ మొదటికి వచ్చింది.  పట్టాల పంపిణీ కి అడ్డంకులు ఏర్పడుతుండడంతో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల కోసం నిరీక్షణ తప్పట్లేదు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు చొరవచూపి పట్టాలు ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 

Updated Date - 2021-04-18T06:20:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising