ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎడతెరిపి లేని వర్షం

ABN, First Publish Date - 2021-07-23T06:52:44+05:30

పట్టణంలో గురువారం ఉదయం నుంచి ఎ డతెరిపి లేకుండా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలోని పలు కాలనీలు జలమయమయ్యాయి.

ఉరవకొండ టవర్‌క్లాక్‌ కూడలిలో నిలిచిన వర్షపునీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉరవకొండ, జూలై 22: పట్టణంలో గురువారం ఉదయం నుంచి ఎ డతెరిపి లేకుండా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. టవర్‌క్లాక్‌ కూడలిలో వర్షపునీరు మడుగులా నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనచోదకులు, ప్రజ లు తీవ్ర ఇబ్బంది పడ్డారు.


కుంటను తలపిస్తున్న తోలుషాపు కాలనీ

గుత్తి: మున్సిపల్‌ పరిధిలోని గుత్తి ఆర్‌ఎ్‌స 25వ వార్డు తోలుషాపు కా లనీ ఎడతెరిపి లేని వర్షాలతో బుదమయంగా మారింది. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షపునీరు జనావాసాల నడుమే భారీగా నిలిచిపోయింది.  రోడ్డుకు ఇరువైపులా మురుగు కాలువలు లేకపోవడంతో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వర్షపునీరు ముందుకు పోలేక ఎక్కడికక్కడ స్తంభిం చింది. కాలనీలో ఎక్కడ చూసినా చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా వీలు లేకుండా వర్షపునీరు నిలిచిపోయింది. మరోవైపు మురికిగుంటలు పందులకు ఆవాసంగా మారాయి.  దోమలు విజృంభించి రోగాలబారినపడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. వార్డు కౌన్సిలర్‌ కనీసం ఇటువైపు కూడా తొంగిచూడటం లేదని, మున్సిపల్‌ అధికారులు, సచివాలయ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో నిలిచిన వర్షపు నీటిని మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. 

Updated Date - 2021-07-23T06:52:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising