జిల్లాలో 25,690 మందికి నేతన్న నేస్తం లబ్ధి
ABN, First Publish Date - 2021-08-11T06:10:05+05:30
జిల్లా లో 25,690 మందికి వైఎ్‌సఆర్ నేతన్న నేస్తం లబ్ధి చేకూరినట్లు కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పే ర్కొన్నారు. రూ.61.66 కోట్లు లబ్ధిదారుల ఖాతాలకు జ మ చేశారన్నారు.
రూ.61.66 కోట్లు బ్యాంకు ఖాతాలకు జమ
కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్
అనంతపురం, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): జిల్లా లో 25,690 మందికి వైఎ్‌సఆర్ నేతన్న నేస్తం లబ్ధి చేకూరినట్లు కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పే ర్కొన్నారు. రూ.61.66 కోట్లు లబ్ధిదారుల ఖాతాలకు జ మ చేశారన్నారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎ స్ జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కా ర్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూ డో విడత వైఎ్‌సఆర్ నేతన్న నేస్తం లబ్ధిని బటన్ నొక్కి, ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు మం త్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ, కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మె ల్యే ఉషశ్రీచరణ్, నగరపాలక సంస్థ మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, ఆర్టీసీ రీజినల్ డైరెక్టర్ మంజుల, ఏడీసీసీ బ్యాంకు చైర్ పర్సన్ లిఖిత, జేసీ గంగాధర్ గౌడ్ హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మూడో విడత వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం కింద 25,690 మందికి రూ .61.66 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. సొంత మగ్గాలున్న చే నేత కార్మికులకు రూ.24వేలు చొప్పున వారి ఖాతాలకు జమైందన్నారు. ఈ లబ్ధితో చేనేత కార్మికులు పవర్‌లూమ్స్‌కి పోటీగా వారి మగ్గాలను ఆధు నికీకరించుకోవడం, ముడి సరుకులను కొనుగోలు చేయ డం తదితర మౌలిక అవసరాలు తీర్చుకోవచ్చ న్నా రు. జిల్లాలో ఎవరైనా అర్హులైన లబ్ధిదారులుంటే సమీప సచివాలయాల్లో నేతన్న నేస్తం కింద దరఖా స్తు చేసుకోవాలన్నారు. నెలరోజుల వ్యవధి ఉం దనీ, అప్పటిలోగా దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తామన్నారు. అనంతరం మ ంత్రి, కలెక్టర్‌తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు నేత న్న నేస్తం కింద రూ.61.66 కోట్ల మెగా చెక్కును ల బ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎ మ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, యామినీబాల, ఏడీసీసీ బ్యా ంకు మాజీ అధ్యక్షుడు పామిడి వీరాంజనేయు లు, చేనేత, జౌళిశాఖ ఏడీ మహేశ్వరరెడ్డి, ఆ శాఖ అధికారులు, సిబ్బంది, చేనేత కార్మికులు పాల్గొన్నారు.
పర్యావరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయండి : కలెక్టర్
జిల్లా పర్యావరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చే యాలని కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్.. సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్.. ఆయా శాఖ ల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రణాళిక అమలులో మున్సిపాలి టీలు, పంచాయతీలు ముందుండాలన్నారు. వ్యర్థాల నిర్వహణలో స్థానిక సంస్థలు ప్రధాన పాత్ర పోషించాలన్నారు. చెత్త నిర్వహణలో బెంగళూరు వంటి మహా నగరాల్లో తీసుకుంటున్న వినూత్న చర్యలను జిల్లాలో అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్ల ను ఆదేశించారు. పరిశ్రమల వ్యర్థాల ప్రభావం పరిసర ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యంపై పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి, జిల్లా వైద్యాధికారి కామేశ్వరప్రసాద్, నగర పాలక సంస్థ కమిషనర్ మూర్తి, మున్సిపల్ కమిషనర్లు, ఎస్‌సీఆర్‌డబ్ల్యూఎస్, మైనింగ్ అధికారులు, జిల్లా పరిశ్రమల అధికారి, కాలుష్య నియంత్రణ శాఖ ఈఈ పాల్గొన్నారు.
Updated Date - 2021-08-11T06:10:05+05:30 IST