ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం తగదు

ABN, First Publish Date - 2021-06-23T06:07:48+05:30

ప్రజా సమస్యలు సకాలంలో పరి ష్కరించని అధికారులపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే 

ధర్మవరంరూరల్‌, జూన22: ప్రజా సమస్యలు సకాలంలో పరి ష్కరించని అధికారులపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాల యంలో మండలస్థాయి గ్రీవెన్స కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా గత వారంలో జరిగిన గ్రీవెన్సలో సమస్యల పరిష్కారంపై ఆరా తీశారు. చాలా గ్రామాల్లో వ్యవసాయసిబ్బంది ప్రజ ల వద్దకు పోకుండా ఫోన చేసి అడుగుతున్నారని ప్రజల వద్దకు వెళ్లలే దని కాల్‌సెంటర్‌ ద్వారా ఫిర్యాదులు వచ్చాయని వ్యవసాయాధికా రులపై ఆసహనం వ్యక్తం చేశారు. అనంతరం గ్రీవెన్సలో ఎమ్మెల్యే పలు గ్రామాల నుంచి చేయూత, రైతుభరోసా, క్రాప్‌ఇన్సూరెన్స, భూసమస్యల తో పాటు వివిధ సమస్యలను ప్రజలతో ఆర్జీలను స్వీకరించారు. దీంతో ఆర్జీలకు సంబంధించి పరిష్కారం కోసం ఆయా గ్రామస్థాయి అధికారు లతో వివరణ కోరగా వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో కొంతమంది అధికారులు వీరి సమస్య తెలియదు అనడంతో గ్రామాల్లో మీరేమి చేస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వం  ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు పెద్దఎత్తున సచివాలయాల ను ఏర్పాటు చేస్తే అక్కడ సిబ్బంది మాత్రం సచివాలయాల్లో కూర్చుని ప్రజల వద్దకు వెళ్లకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఆసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది సక్రమంగా పనిచేస్తే ఇన్ని సమస్యలు ఎలా వ స్తాయని ఎంపీడీఓ అశోక్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించారు. అదేవిధంగా రైతు భరోసా, క్రాప్‌ ఇన్సూరెన్స సమస్యలపై ఏఓను అడగగా ఏఓ హాజరుకాక పోవడంతో ఏడీఏకు ఫోనచేసి మండిపడ్డారు. అనంతరం వైఎస్సాఆర్‌ చేయూత పథకంకు సంబంధించి 26.82కోట్లు మెగా చెక్కును వెలుగు అధికారులతో కలిసి లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో ఎంపీడీ ఓ అశోక్‌కుమార్‌రెడ్డి, తహసీల్దార్‌ నీలకంఠారెడ్డి, ఏపీఓ అనిల్‌కుమా ర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు సర్పంచలు, పంచాయితీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-06-23T06:07:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising