ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకటిన్నర సెంటు స్థలం కోసం హత్య

ABN, First Publish Date - 2021-01-23T06:52:45+05:30

ఒకటిన్నర్ర సెంటు స్థలం కోసం వరుసకు సోదరుడైన చన్నరాజును హత్యచేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్‌చేసినట్లు పెనుకొండ ఇనచార్జ్‌ డీఎస్పీ మహబూబ్‌బాష తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కేసును ఛేదించిన పోలీసులు - నలుగురు నిందితుల అరెస్ట్‌ 

హిందూపురం టౌన, జనవరి 22: ఒకటిన్నర్ర సెంటు స్థలం కోసం వరుసకు సోదరుడైన చన్నరాజును హత్యచేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్‌చేసినట్లు పెనుకొండ ఇనచార్జ్‌ డీఎస్పీ మహబూబ్‌బాష తెలిపారు. హత్యకేసు వివరాలను శుక్రవారం సర్కిల్‌ పోలీ్‌సస్టేషన వద్ద విలేకరులకు వెల్లడించారు. పరిగి మండలం గొర్రెపల్లికి చెందిన చెన్నరాజును ఈనెల 17 రాత్రి ఓబులేసు కత్తితో పొడిచి హత్యచేశారు. గొర్రిపల్లిలోని ఎస్సీ కాలనీలో సర్వేనంబరు 51-3బీలో ఒకటిన్నర సెంటు స్థలం విషయమై చెన్నరాజు, శీగుపల్లి నరసింహప్పకు కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ విషయంపై ఈనెల 17న సాయంత్రం చెన్నరాజు ఇంటి వద్ద ఓబులేసు, ఆయన సోదరుడు శీగుపల్లి నరసింహప్ప అతని భార్య ఉమాదేవి, వారి కుమారుడు నరేంద్ర గొడవపడ్డారు. ఆ సమయంలో ఓబులేసు చెన్నరాజు ఛాతిపై కత్తితో పొడవడం తో తీవ్ర రక్తస్ర్తావమైంది. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. అంతేకాక చెన్నరాజు సోదరుడు నరసింహప్పపై కూడా దాడిచేశారు. దీనిపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టిన రూరల్‌సీఐ ధర ణికిషోర్‌, ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం మోదా సమీపంలోని విఠలాపురం క్రాస్‌వద్ద నలుగురు నిందితులను అరె్‌స్ట చేసినట్లు డీఎ్‌సపీ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుల ను అరె్‌స్టచేసిన సీఐ ధరణికిషోర్‌, ఎస్‌ఐ శ్రీనివాసులు, సిబ్బందికి రివార్డును అందించారు. సమావేశంలో వనటౌన సీఐ బాలమద్దిలేటి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-23T06:52:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising