ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హామీల అమలుకు ఉద్యమాలు ఉధృతం

ABN, First Publish Date - 2021-07-31T06:15:36+05:30

ప్రజా సమస్యల పరిష్కారం, పాలక పక్షాలు ఇచ్చిన హామీల అమలుకు ప్ర జా ఉద్యమాలను ఉధృతం చేయాలని సీపీఎం నిర్ణయించిందని ఆ పార్టీ జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌ పేర్కొన్నారు.

మాట్లాడుతున్న రాంభూపాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌


అనంతపురం టౌన్‌, జూలై 30: ప్రజా సమస్యల పరిష్కారం, పాలక పక్షాలు ఇచ్చిన హామీల అమలుకు ప్ర జా ఉద్యమాలను ఉధృతం చేయాలని సీపీఎం నిర్ణయించిందని ఆ పార్టీ జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక గణేనాయక్‌ భవన్‌లో నిర్వహించిన జిల్లా శాఖ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా జిల్లా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. కేంద్రీ య విశ్వవిద్యాలయ నిర్మాణం ప్రహరీ దశలోనే ఆగిపోయిందన్నారు. యువతకు ఉపాధి ఇచ్చే ఒక్క పరిశ్రమ కూడా అనంతకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇ చ్చిన హామీలు అమలు చేయలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రజలపై భారాలు మోపడం సిగ్గుచేటన్నారు. హా మీల అమలు, ప్రజలపై వేసే భారాలకు వ్యతిరేకంగా ప్ర జా ఉద్యమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి ఆగస్టులో జిల్లావ్యాప్తంగా మండల, పట్టణ మహాసభలు, అక్టోబరు మొదటివారంలో జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటి నిర్వహణ, సీపీఎం చేపట్టనున్న ఉద్యమాలకు ప్రజల సహకారం కోరుతూ ఆగస్టు 1 నుంచి 5వ తేదీ వరకు అన్ని మండలాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కా ర్యక్రమంలో సీపీఎం నేతలు నాగేంద్రకుమార్‌, సావిత్రి, బాలరంగయ్య, శ్రీనివాసులు, చంద్రశేఖర్‌ రెడ్డి, నాగమ ణి, రామిరెడ్డి, రాయుడు, లక్ష్మీదేవి, తరిమెల నాగరాజు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.


Updated Date - 2021-07-31T06:15:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising