ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమిషనర్‌ వ్యాఖ్యలపై వైద్య ఉద్యోగుల నిరసన

ABN, First Publish Date - 2021-05-20T06:13:03+05:30

కరోనా సమయంలో నిరంతరం శ్రమిస్తున్న ఆరోగ్య, వైద్య ఉద్యోగుల పట్ల ఫ్యామిలీ వెల్‌ఫేర్‌ శాఖ రాష్ట్ర కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ వ్యాఖ్యలపై వైద్య ఉద్యోగులు నిరసన చేపట్టారు.

జిల్లా ఆస్పత్రిలోని ఓపీ వద్ద నిరసన తెలుపుతున్న వైద్య ఉద్యోగులు, ఎనజీఓ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం, మే19 : కరోనా సమయంలో నిరంతరం శ్రమిస్తున్న ఆరోగ్య, వైద్య ఉద్యోగుల పట్ల ఫ్యామిలీ వెల్‌ఫేర్‌ శాఖ రాష్ట్ర కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ వ్యాఖ్యలపై వైద్య ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఆయన రెండు రోజుల క్రితం సమీక్షలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైద్యాధి కారులు, వైద్యులు, సిబ్బంది తీరుపై మండి పడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కమి టీ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆందోళనకు పిలుపు నిచ్చింది. అం దులో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా వైద్య శాఖ ఉద్యోగులు నిరసన సాగించారు. వీరి ఆందోళనకు ఎనజీఓ నాయకులు మద్దతు పలికి పాల్గొన్నా రు. జిల్లా సర్వజన ఆస్పత్రిలో ఓపీతో పాటు ఐడీ విభాగం వద్ద ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఎనజీఓ నేతలు కలిసి నిరసన తెలియజేశారు. కరోనా సమయం లో నిరంతరం శ్రమిస్తున్న ఆరోగ్య, వైద్య ఉద్యోగుల ప ట్ల కమిషన ర్‌ చేసిన వ్యాఖ్యలు అర్థ రహితమని మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో ఎనజీఓ నాయకులు ఆరోగ్య శాఖ ఉద్యోగులు హతావుల్లా, రవికుమార్‌, శ్రీధర్‌బాబు, లక్ష్మన్న, వేణుగోపాల్‌, చంద్రమోహన, నాగరాజు, రంగనాథ్‌, సుదర్శన శర్మ, శ్రీనివాస్‌రెడ్డి పలువురు వైద్యులు, స్టాఫ్‌ నర్సులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

చెన్నేకొత్తపల్లి:  ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తరుణంలో సిబ్బంది తమ ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందిస్తుంటే... ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కరరావు వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం తగదని ఏపీఎన్జీఓ తాలూకా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, మండల వైద్యా ధికారి ఉదయ్‌కుమార్‌ అన్నారు. కమిషనర్‌  వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవా రం ఎనఎస్‌గేటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆస్పత్రి వైద్యసిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరిం చుకోవాలని కోరారు. సంఘం కోశాధికారి విశ్వనాథరెడ్డి,  ప్రతినిధులు రాజశేఖర్‌రెడ్డి, ఎంపీహెచఈఓ నరసప్ప, నవీనకుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-05-20T06:13:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising