ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోరంట్ల వాసవీమహాల్‌లో వైద్య శిబిరం

ABN, First Publish Date - 2021-04-18T06:19:33+05:30

పట్టణంలోని వాసవీమహాల్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

ఉచితంగా మందులు అందజేస్తున్న వైద్య సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోరంట్ల, ఏప్రిల్‌ 17: పట్టణంలోని వాసవీమహాల్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. గోరంట్ల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బలరాంగుప్తా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా వైద్య చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాన్ని వైసీపీ నాయకులు టీచర్‌ నాగేనాయక్‌, ఉపసర్పంచ రాజారెడ్డి ప్రారంభించారు. శిబిరంలో అనంతపురం కిమ్స్‌ సవేరా ఆసుపత్రి వైద్యులు డా.రాజేశగౌడ్‌ గుండెసంబంధిత,  డా. రాజేశకుమార్‌ రెడ్డి ఎముకలు, డా.జాషువాకాలెం నరములు, డా.పావని గర్భసంబంధిత, సయ్యద్‌ అఫ్రోజ్‌ సాధారణ రోగాలకు వైద్యపరీక్షలు చేశారు. ఆసుపత్రి డిప్యూటీ మేనేజర్‌ మహ్మద్‌ అక్రం పాల్గొన్నారు. బీపీ, షుగర్‌, రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, మాత్రలు అందజేశారు. శిబిరంలో 575మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 47మందికి శస్త్ర చికిత్సల కోసం వైద్యులు రెఫర్‌ చేశారు. వైద్య శిబిరంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు బలరాంగుప్తా, సూర్యప్రకాశ, జనార్దనగుప్తా, నందగోపాల్‌, మాధవగుప్తా, గౌరీశంకర్‌, సుకుమార్‌ గుప్త, యువజన సంఘం నాయకులు కట్టా తిరుపాల్‌, దండ మణికంఠ, అన్నా మణికంఠ, శివప్రసాద్‌, బాలక్రిష్ణ, తదితరులుసేవలందించారు. 


Updated Date - 2021-04-18T06:19:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising