ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన సంపూర్ణం

ABN, First Publish Date - 2021-05-17T05:11:45+05:30

కొవిడ్‌ ఉదృతి పెరుగుతున్న వేళ ఆదివారం పట్టణంలో సంపూర్ణ లాక్‌డౌన విధించారు. ఉదయం నుంచే వాహనాలు రోడ్డెక్కనీయకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు.

నిర్మానుష్యంగా ఉన్న హిందూపురం మెయిన బజార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-రోడ్లపై కానరాని ప్రజలు 

- పోలీసుల పటిష్ట పర్యవేక్షణ

హిందూపురం టౌన, మే 16: కొవిడ్‌ ఉదృతి పెరుగుతున్న వేళ ఆదివారం పట్టణంలో సంపూర్ణ లాక్‌డౌన విధించారు. ఉదయం నుంచే వాహనాలు రోడ్డెక్కనీయకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. సీఐలు ధరణికిషోర్‌, ఎస్‌ఐ కరీంలు రోజంతా పట్టణంలో పర్యవేక్షిస్తూ అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని హెచ్చరించారు. ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లపైకి తిరుగుతున్న వాహనదారులకు జరిమానాలు విధించారు. కొవిడ్‌ నిబంధనలపై వారికి అవగాహన కల్పించారు. అత్యవసరాల పరిస్థితులుంటేనే బయటికి రావాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తే కేసులు నమోదు చేయడంతోపాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

పెనుకొండ: కరోనా నియంత్రణలో భాగంగా ఆదివారం పెనుకొండలో కర్ఫ్యూ పకడ్బందీగా నిర్వహించారు. కర్ఫ్యూ సందర్భంగా పట్టణంలోని హోటళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాలు పూర్తీగా మూసివేశాయి. ఆటోలు, బస్సులు, ఇతర వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. జనసంచారం లేక వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం డీఎ్‌సపీ మహబూబ్‌బాష, సీఐ శ్రీహరి, తహసీల్దార్‌ నాగరాజు, వారి సిబ్బంది కర్ఫ్యూను పర్యవేక్షించారు. 


Updated Date - 2021-05-17T05:11:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising