జోగిని, దేవదాసి వ్యవస్థను రూపుమాపుదాం : ఆర్డీఓ
ABN, First Publish Date - 2021-04-16T06:29:58+05:30
జోగిని, దేవదాసి వ్యవస్థను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆర్డీఓ నిశాంతరెడ్డి పిలుపునిచ్చారు.
సమావేశంలో పాల్గొన్న ఆర్డీఓ, డీఎస్పీ తదితరులు
కళ్యాణదుర్గం, ఏప్రిల్ 15: జోగిని, దేవదాసి వ్యవస్థను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆర్డీఓ నిశాంతరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఆర్డీఓ కా ర్యాలయంలో డీఎస్పీ రమ్యతో కలిసి కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన పరిధిలోని వివిధ శా ఖల అధికారులతో ఆయన సమీక్షించారు. జోగిని, దేవదాసిలను ప్రజలతో సమానంగా జీ వించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని 9 మండలాల్లో వీరి సంఖ్య అధికంగా ఉందన్నారు. మండల స్థాయి అధికారులు గ్రామా ల్లో పర్యటించి ఈవ్యవస్థ నిర్మూలనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
Updated Date - 2021-04-16T06:29:58+05:30 IST