ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీకలగురికిలో తాగునీటికి కటకట

ABN, First Publish Date - 2021-06-23T06:23:11+05:30

మండలంలోని చీకలగురికి గ్రామం లో 25 రోజులుగా తాగునీరు అందక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొటుంన్నారు.

పొలాల వద్ద ఎద్దుల బండిలో నీటిని నింపుకుంటున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొలాల్లోని బోర్లే గతి..

3 కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిందే!

పీఏబీఆర్‌లో పని చేయని పంపింగ్‌ మోటార్లు 


విడపనకల్లు, జూన 22: మండలంలోని చీకలగురికి గ్రామం లో 25 రోజులుగా తాగునీరు అందక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొటుంన్నారు. గ్రామానికి తాగునీరు అందించే పీఏబీఆర్‌ డ్యాంలోని పంపింగ్‌ మోటార్లు పూర్తిగా శిథిలమై పని చేయకుండా పోయాయి. వారాల తరబడి గ్రామస్థులకు నీరందకున్నా పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు.  పీఏబీఆర్‌ డ్యాం నుంచి లత్తవరం సంపులోకి నీటిని పంపింగ్‌ చేసి చీకలగురికి గ్రామ ట్యాంక్‌లోకి నింపి తాగునీరు అందిస్తారు. మోటార్ల మరమ్మతుతో  నీటి సరఫరా నిలిచిపోయింది. విధిలేక గ్రామస్థులు దాదాపుగా 3 కిలో మీటర్లు దూరం పొలాల్లోకి వెళ్లి ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లలో నీటిని తీసుకు వస్తున్నారు. అధికారులు వారం రోజుల క్రితం పీఏబీఆర్‌ డ్యాంలోని నీటిని పంపింగ్‌ చేసే మోటార్లను వెల్డింగ్‌ మిషన ద్వా రా తొలగించారు. అయితే వాటి వాటి స్థానంలో మోటార్ల ఏర్పాటు ను మరిచారు.


కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా దాదాపుగా మూడు వారాలకు పైగా మోటార్లును వదిలేశారు. దీంతో గా మస్థులకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కొత్త మోటార్లకు ఆర్డర్లు ఇచ్చారని, హైదరాబాద్‌ నుంచి రావాలని అధికారులు చెబు తున్నారు. కొత్త మోటార్లు రావటానికి ఇంకా నాలుగు రోజులు స మయం పడుతుందని సమాచారం. వెంటనే మోటార్లు అమర్చి గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ దాక్షాయణి మాట్లాడుతూ, పీఏబీఆర్‌లో రెండు మోటార్లు శిథిలమై పనిచేయలేదన్నారు. దీంతో కొత్తమోటార్లకు ఆర్డర్లు పెట్టామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో మోటార్లు రాగానే తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2021-06-23T06:23:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising