ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటకోత ప్రయోగాలను పరిశీలించిన జేడీఏ

ABN, First Publish Date - 2021-10-21T05:40:09+05:30

మండలంలోని చిగిచెర్ల రెవెన్యూ గ్రామపొలం, గరుడంపల్లి వద్ద ఖరీఫ్‌ వేరుశనగ పంట కోత ప్రయోగాలను వ్యవసాయధికారులతో కలిసి ఏఎస్‌ఓ గోపాల్‌ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మవరంరూరల్‌, అక్టోబరు20: మండలంలోని చిగిచెర్ల రెవెన్యూ గ్రామపొలం, గరుడంపల్లి వద్ద ఖరీఫ్‌ వేరుశనగ పంట కోత ప్రయోగాలను వ్యవసాయధికారులతో కలిసి ఏఎస్‌ఓ గోపాల్‌ నిర్వహించారు. ఈ పంటకోత ప్రయోగాలను జిల్లా  జేడీఏ చంద్రనాయక్‌ హాజరై పరిశీలించారు. మొదట రైతు కాశెప్ప పొలంలో పంటకోత ప్రయోగాలు చేపట్టగా ఎకరాకు 64.15కేజీలు దిగుబడి వచ్చిందన్నారు. అదేవిధంగా చండ్రాయుడు వేరుశనగ పొలంలో పంటకోత ప్రయోగాలు చేయగా 47.62కేజీలు దిగుబడి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా జేడీఏ మాట్లాడుతూ  సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో దిగుబడిపై ప్రభావం చూపిందన్నారు. వేరుశనగ పంట పరిస్థితిపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ చన్నవీరస్వామి, సర్పంచ్‌ ముత్యాలప్పనాయుడు, వీహెచ్‌ఏ భా ర్గవ్‌, ఎంపీఈఓలు స్వాతి, గాయిత్రి, అరుణ, వీఆర్‌ఏలు తిక్కయ్య, నారాయణస్వామి రైతులు హజరయ్యారు. 


Updated Date - 2021-10-21T05:40:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising