ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై పోరులో ప్రైవేట్‌ ఆస్పత్రులు సహకరించాలి

ABN, First Publish Date - 2021-05-09T06:05:21+05:30

కరోనాపై పోరాటంలో జిల్లా యంత్రాంగానికి ప్రైవేట్‌ ఆస్పత్రులు సహకరించాలని జాయింట్‌ కలెక్టర్లు నిశాంతకుమార్‌, సిరి సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేసీలు నిశాంతకుమార్‌, సిరి

అనంతపురం, మే8(ఆంధ్రజ్యోతి): కరోనాపై పోరాటంలో జిల్లా యంత్రాంగానికి ప్రైవేట్‌ ఆస్పత్రులు సహకరించాలని జాయింట్‌ కలెక్టర్లు నిశాంతకుమార్‌, సిరి సూచించారు. శనివారం వారు జడ్పీ మీటింగ్‌ హాల్‌లో ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి, మాట్లాడారు. జిల్లాలో ఆక్సిజన కొరత లేదన్నారు. కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు అవసరమైన మోతాదు కంటే ఎ క్కువ ఆక్సిజనను బుక్‌ చేసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. సాధారణ పడకలను కూడా ఆక్సిజన పడకలుగా చూపి స్తూ ఎక్కువ మోతాదులో సిలిండర్లు పొందుతున్నాయన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తీసు కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆక్సిజన పక్కదారి పట్టకుండా మరిన్ని చర్యలు చేపట్టామన్నారు. ఆక్సిజన ఫిల్లింగ్‌ పాయింట్‌ వద్ద పర్యవేక్షణ కోసం డిప్యూటీ తహసీల్దార్‌, పోలీసులను నియమిస్తామన్నారు. సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేసి తనిఖీ చేస్తామన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులు అధిక ఫీజులు వసూ లు చేస్తున్నాయని, సంక్షోభ కాలంలో వ్యాపార ధోరణి వీడి మానవతా దృక్పథంతో పనిచేయాల న్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కే కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించాలన్నారు. ప్రభుత్వం ఇదివరకే కొవిడ్‌-19ను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ చికిత్సలకు ధరల పట్టికను విడుదల చేసిందన్నారు. తాజా గా కేవలం కొవిడ్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరినా ఆరోగ్యశ్రీ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 శాతం పడకలను ఆరోగ్యశ్రీకి కేటాయించాలన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు రెమ్‌డిసివిర్‌ వ్యాక్సినను ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.2400కే కంపెనీల నుంచి పొందాలన్నారు. ఎక్కువ ధర చెప్తే తమకు ఫిర్యాదులు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎ్‌ఫఓ జగన్నాథ్‌సింగ్‌, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-09T06:05:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising