ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జగనన్న గోరుముద్ద’ కష్టం.. ‘భోజన’ ఏజెన్సీలకు అప్పుల భారం

ABN, First Publish Date - 2021-04-18T06:23:53+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న ‘జగనన్న గోరుముద్ద’ మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీలకు భారమైంది. నెలల తరబడి బిల్లులు అందక అప్పులపాలవుతున్నారు.

పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐదు నెలలుగా అందని 

మధ్యాహ్న భోజన పథకం బిల్లులు 


బొమ్మనహాళ్‌, ఏప్రిల్‌ 17 : ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న ‘జగనన్న గోరుముద్ద’ మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీలకు భారమైంది. నెలల తరబడి బిల్లులు అందక అప్పులపాలవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి వంట ఏజెన్సీలకు సకాలంలో బిల్లుల చె ల్లింపు గగనమైంది. ఈపరిస్థితుల్లో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు భోజన పథకం మెనూ అమలు చేయడం ఏజెన్సీలకు కష్టాలను తెచ్చి పె డుతోంది. మండలంలోని భోజన పథకం ఏజెన్సీలకు ఐదు నెలలుగా బిల్లు లు అందలేదు. పిల్లల కడుపులు మాడ్చటం ఎందుకని వంట ఏజెన్సీల ని ర్వాహకులు అప్పులు చేసి పిల్లలకు భోజనం అందిస్తున్నారు. చేతిలో చిల్లిగ వ్వ లేక వంట చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ఆ ప్రభావం భోజన నాణ్యతపై పడటంతో పిల్లలకు సరైన పోషకాహారం అం దడం కష్టతరంగా మారుతోంది. మండలంలో 49 పాఠశాలల్లో 8386 మం ది విద్యార్థులు చదువుతున్నారు. ఉన్నత పాఠశాలల్లో ఒక్కొక్క విద్యార్థికి రూ.7.45 పైసలు, ప్రాథమిక పాఠశాలలో రూ.4.97 పైసల చొప్పున ప్రభు త్వం ఇస్తోంది. ఈ మొత్తంలోనే నిర్వాహకులు వంట గ్యాస్‌, పప్పు, ఉప్పు, కారం, నూనె, కూరగాయలు వంటి అన్ని వస్తువులను సమకూర్చుకుని ప్ర భుత్వం నిర్ధేశించిన మోనూ మేరకు ‘జగనన్న గోరుముద్ద’ పథకం అమలు చేయాల్సి వుంది. దీనికితోడు పెరిగిన నిత్యావసరాల ధరలు భారంగా మా రుతున్నాయి.


పిల్లలకు అన్నం వండి పెడితే కూలీ అయినా గిట్టుబాటు అ వుతుందని భావించిన నిర్వాహకులకు మొండిచేయే మిగులుతోంది. నెలనె లా బిల్లులు అప్పులపాలు కావడం తప్ప మిగిలేది ఏమీ లేదని వాపోతు న్నారు. ప్రస్తుతం మండలంలోని ఏజెన్సీ నిర్వాహకులకు గతేడాది నవంబ రు నెల నుంచి ఈ యేడాది మార్చి వరకు బిల్లులు రావాల్సి వుంది. ఏప్రిల్‌ నెల కూడా పక్షం రోజులకు బకాయిలు రాకపోవడంతో వండటం ఎలా అంటూ ఆవేదన చెందుతున్నారు. సుమారు 200 మంది విద్యార్థులకు భో జనం పెట్టాలంటే.. తాము చేస్తున్న శ్రమ కాకుండా సరుకుల కోసం రూ. 1500 వరకు వెచ్చించాల్సిన పరిస్థితి. నెలలో సెలవు రోజులు మినహాయించినా రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని చెబుతున్నారు. కా యకష్టం చేసుకునే ఏజెన్సీ నిర్వాహకులకు ఇది చాలా పెద్ద మొత్తం. కనీ సం బిల్లులు నెలనెలా చెల్లిస్తే వంట ఏజెన్సీల మీద ఆర్థిక భారం పడదు.  ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు నాణ్యమైన భోజనాన్ని పిల్లలకు అందించేందుకు అవకాశం వుంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఐదు మాసా ల నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించాలని మండలంలోని ప్రభుత్వ పా ఠశాలల వంట ఏజెన్సీల నిర్వాహకులు కోరుతున్నారు.  


Updated Date - 2021-04-18T06:23:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising