ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమంగా తరలిస్తున్న రేషన బియ్యంపై విచారణ

ABN, First Publish Date - 2021-05-06T06:22:16+05:30

అక్రమంగా బ్లాక్‌ మార్కెట్‌కి తరలుతున్న రేషన బియ్యాన్ని స్థానికులు బుధవారం కోడూరు తోపులో అడ్డుకున్నారు.

విచారణ చేస్తున్న ఆర్‌ఐ బిలాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిలమత్తూరు, మే 5: అక్రమంగా బ్లాక్‌ మార్కెట్‌కి తరలుతున్న రేషన బియ్యాన్ని స్థానికులు బుధవారం కోడూరు తోపులో అడ్డుకున్నారు. గోరంట్లకు చెందిన ఇద్దరు వ్యక్తులు లగేజీ ఆటోలో సుమారు 20 బస్తాల బియ్యాన్ని కోడూరు తోపు నుంచి బాగేపల్లి వైపుకు తరలిస్తుండగా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆటోని అతివేగంగా తిప్పుకొని గోరంట్ల వైపుకు తీసుకెళ్లారు. అయితే తరలిస్తున్న బియ్యం స్థానిక ప్రభుత్వ పాఠశాలకు చెందిన మధ్యాహ్న భోజన పథకానికి చెందినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో తహసీల్దార్‌ రంగనాయకులు ఆదేశాలతో ఆర్‌.ఐ బిలాల్‌ పాఠశాలకు చేరుకొని అక్రమంగా రవాణా చేస్తున్న బియ్యంపై విచారణ చేపట్టారు. పాఠశాలకు చెందిన బియ్యం నిల్వలు ఉన్న గదికి తాళం వేసి ఉండటంతో  ప్రధానోపాధ్యాయులకు ఫోను చేసి, బియ్యం స్టాక్‌ రిపోర్టుని పరిశీలించాలని, వెంటనే పాఠశాలకు రావాలని కోరారు. తాను అనంతపురంలో ఉన్నానని, వచ్చేందుకు ఆలస్యం అవుతుందని చెప్పడంతో బియ్యం నిల్వలు ఉన్న గదికి తాళం వేసి సీజ్‌ చేశారు. అనంతరం స్థానికులతో విచారించారు. ప్రధానోపాధ్యాయులు వచ్చిన వెంటనే బియ్యం నిల్వలు ఉన్న గదిని ఓపెన చేసి, స్టాకు రిపోర్టు సరిచూస్తామని తెలిపారు. ఏవైనా తేడాలు వస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ వీఆర్వో శాంతాభాయి, గ్రామ సర్పంచ మురళి, పాఠశాల కమిటీ చైర్మన అశ్వత్థరెడ్డి, అయూబ్‌ తదితరలు పాల్గొన్నారు. 





Updated Date - 2021-05-06T06:22:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising