ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడికి అడ్డంగా దీక్ష..!

ABN, First Publish Date - 2021-10-23T05:35:35+05:30

రాజకీయ కార్యక్రమా లు సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుంటారు. ఎవరైనా పాఠశాలకు దగ్గరలో ని ర్వహిస్తారా? చదువుకు ప్రాధాన్యమిచ్చే.. చదువు విలువ తెలిసిన వారెవరూ అలా చేయరు.

దీక్షాశిబిరంలోని కుర్చీల మధ్య నుంచి ఇబ్బందులు పడుతూ వెళ్తున్న విద్యార్థులు (వృత్తంలో..)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విద్యార్థులు పాఠశాలలోకి వెళ్లేందుకు కూడా దారిలేని దుస్థితి.. 

 లౌడ్‌ స్పీకర్ల మోతతో సాగని బోధన 

 గ్రామాలకు వెళ్లేందుకు వాహనదారుల అవస్థలు..


యాడికి, అక్టోబరు 22: రాజకీయ కార్యక్రమా లు సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుంటారు. ఎవరైనా పాఠశాలకు దగ్గరలో ని ర్వహిస్తారా? చదువుకు ప్రాధాన్యమిచ్చే.. చదువు విలువ తెలిసిన వారెవరూ అలా చేయరు. యా డికి మండలంలోని రాయలచెరువులో మాత్రం వైసీపీ నాయకులు ఏకంగా బడి సమీపంలో కా దు, గేటుకు అడ్డంగా దీక్షాశిబిరం ఏర్పాటు చేశా రు. నగరూరు రోడ్డులోని ప్రాథమిక పాఠశాల గేటుకు అడ్డంగా శుక్రవారం జనాగ్రహ దీక్ష చేపట్టారు. విద్యార్థులు బడిలోకి వెళ్లడానికి కూడా దారివ్వకుండా కుర్చీలు అడ్డంగా వేసేసుకున్నారు. వాటి మధ్యలోంచే విద్యార్థులు అష్టకష్టాలు పడు తూ పాఠశాలలోకి చేరుకున్నారు. అంత కష్టపడినా.. విద్యాబోధన మాత్రం సాగలేదు. వైసీపీ నాయకులు అక్కడ బడి ఉందన్న విషయాన్ని మరచి, లౌడ్‌స్పీకర్లు పెట్టి, రాజకీయ ప్రసంగాలు వినిపించారు. దీంతో తరగతి గదుల్లో పిల్లలకు పాఠాలు వినే వీలులేకుండా పోయింది. ఇలా.. వైసీపీ నాయకుల పుణ్యమాని విద్యార్థులకు ఎం తో విలువైన ఒకరోజు విద్యాబోధన లేక వృథా అయిపోయింది. 

 సాయంత్రం విద్యార్థులు బడి నుంచి వెళ్లడానికి నానా అవస్థలు పడ్డారు. విద్యార్థినుల పరిస్థితి మరీ దారుణం. తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. వైసీపీ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడిని బంద్‌ చేసి, అందులోనే దీ క్షా కార్యక్రమం చేపట్టి ఉంటే పోయుండేది కదా.. అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక.. కూర్మాజీపేట, రామరాజుపల్లి, తూట్రాళ్లపల్లి, నగరూరు, బోగాలకట్ట తదితర గ్రామాలకు వెళ్లే నగరూరు రోడ్డులోనే శిబిరం ఏర్పాటు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. జనాగ్రహ దీక్ష ఇలా పాఠశాలకు అడ్డంగా, రహదారిపై చేపట్టడంపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆ దారిగుండా వెళ్లేవారు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Updated Date - 2021-10-23T05:35:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising