ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధినేత దీక్షకు సంఘీభావంగా అనంతలో దీక్ష

ABN, First Publish Date - 2021-10-22T06:05:49+05:30

టీడీపీ జాతీయ కార్యాలయంతోపాటు నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడిని నిరసిస్తూ అధినేత నారా చంద్రబాబునాయుడు 36 గంటల పాటు చేపట్టిన దీక్షకు అనంత తమ్ముళ్లు సంఘీభావం తెలిపారు.

బాబు దీక్షకు సంఘీభావంగా దీక్ష చేపడుతున్న జేఎల్‌మురళి, కిరణ్‌గౌడ్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం, అక్టోబరు 21: టీడీపీ జాతీయ కార్యాలయంతోపాటు నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడిని నిరసిస్తూ అధినేత నారా చంద్రబాబునాయుడు 36 గంటల పాటు చేపట్టిన దీక్షకు అనంత తమ్ముళ్లు సంఘీభావం తెలిపారు. గురువారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జేఎల్‌ మురళీధర్‌ జిల్లా కేంద్రంలోని తమ కార్యాలయంలో సంఘీభావ దీక్షకు దిగారు. ఆయన దీక్షకు టీడీపీ నాయకులు కిరణ్‌కుమార్‌ గౌడ్‌, కృష్ణకుమార్‌, వడ్డే వెంకటాద్రి, చక్కా నాగేంద్ర, మోహన, మహ్మమద్‌ రఫీక్‌, అనిల్‌, మాధవ్‌, బాబూ, సురేష్‌ మద్దతు పలికారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దీక్షను కొనసాగిస్తూ అధికార వైసీపీ ఆగడాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఎల్‌ మురళి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష కార్యాలయాలపై అధికార వైసీపీ గూండాలు దాడి చేయడం దుర్మార్గమన్నారు. ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ బెదిరించి, భయపెట్టాలని ఇలాంటి దాడులకు పూనుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారనీ, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

మద్దతు తెలిపిన శ్రావణిశ్రీ

శింగనమల : తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా 36 గంటల నిరసన దీక్షకు కూర్చున్న మాజీ ము ఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నా యుడుకు మద్దతుగా ఆ పార్టీ శింగనమల నియోజకవర్గ ఇన చార్జ్‌ బండారు శ్రావణిశ్రీ సంఘీభావం తెలిపారు. ఆమె గురు వారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి దీక్షలో పాల్గొన్నారు.





Updated Date - 2021-10-22T06:05:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising