ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం మూర్ఖత్వంతోనే రోజూ వందల మరణాలు

ABN, First Publish Date - 2021-05-13T06:42:56+05:30

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మూర్ఖత్వంతో కరోనా బాధితులు రోజు వందల సంఖ్యలో చనిపోతున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కళ్యాణదుర్గంలో కొవ్వొత్తులతో నిరసన తెలియజేస్తున్న ఉమా తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు

 కళ్యాణదుర్గం, మే 12: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మూర్ఖత్వంతో కరోనా బాధితులు రోజు వందల సంఖ్యలో చనిపోతున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టి మృతులకు నివాళులర్పించారు. ఈసం దర్భంగా ఉమా మాట్లాడుతూ కరోనా బాధితులకు ఆక్సిజన్‌ అందక సంభవిస్తున్న మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్సిజన్‌ అందక ఇప్పటి వరకు రాష్ట్రంలో 75 మంది మరణించారని ఆరోపించారు. కరోనా నియంత్రణ లో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చినప్పటికి సీఎం జగన్‌లో చలనం లేకపోవడం బాధాకరమన్నారు.  నిత్యం వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం కాకిలెక్కలు చూపి శవాలను సైతం మాయం చేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. అనంతపురం, విజయనగరం, ప్రొద్దుటూరు, కర్నూలు, వినుకొండ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ అందక బాధితులు విలవిలాడిపోతూ ప్రాణాలు వదలడం బాధాకరమన్నారు.  కరోనా వ్యాక్సిన్‌ ప్రతి ఒక్క రికి అందేలా చర్యలు చేపట్టాలని, దహనసంస్కారాలకు రూ.15వేలు అందించాలని, ఆక్సిజన్‌ అందక మృతి చెందిన కుటుంబాలకు రూ.10లక్షలు ఆర్థిక సహాయం అందజేయాలని, కరోనాతో మృతి చెందిన కుటుంబాలను రూ.2లక్షలు సాయం అందజేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు తలారి సత్తి, విరుపాక్షి, పెద్దన్న, గోవిందు, తిమ్మప్ప, మంజునాథ్‌, మనోహర్‌, బంట్రూత్‌ మంజు పాల్గొన్నారు.

 

 సీనియర్‌ జర్నలిస్ట్‌ మృతి బాధాకరం 

 కుందుర్పి మండలానికి చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీనివాసులు మృతి బాధాకరమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాదినేని ఉమామహేశ్వర్‌ నాయుడు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  కరోనా విపత్తులో  విధి నిర్వహణలో ఉంటూ మృతి చెందుతున్న బాధిత జర్నలిస్టు కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.   

Updated Date - 2021-05-13T06:42:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising