ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2021-12-03T05:23:28+05:30

లింగనిర్ధారణ చట్టవిరుద్ధమనీ, అతిక్రమిస్తే వైద్యులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా వైద్యాధికారి కామేశ్వరప్రసాద్‌ హెచ్చరిక

అనంతపురం వైద్యం, డిసెంబరు 2: లింగనిర్ధారణ చట్టవిరుద్ధమనీ, అతిక్రమిస్తే వైద్యులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌ హెచ్చరించారు. గురువారం లింగనిర్ధారణ వ్యతిరేక చట్టంపై అవగాహన కల్పిచేందుకు జిల్లా వైద్యశాఖ కా ర్యాలయంలో ఒకరోజు శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పా ల్గొని మాట్లాడుతూ.. లింగనిర్ధారణకు ఆ స్కారం ఇవ్వొద్దన్నారు. చట్టం అతిక్రమించిన డాక్టర్లు, స్కానింగ్‌ సెంటర్లపై చర్యలు తప్పవన్నారు. తొలిసారి తప్పుచేస్తే మూడేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా, రెండోసారి చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తారన్నారు. అనంతరం హైదరాబాద్‌ నుంచి వచ్చిన శిక్షకుడు డాక్టర్‌ రవికిరణ్‌శర్మ లింగనిర్ధారణ చట్టం గురించి వివరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రామకృష్ణ, డాక్టర్‌ చెన్నకేశవు లు, డాక్టర్‌ సుజాత, ఆర్డీటీ హెల్త్‌ డైరెక్టర్‌ శిరప్ప, రెడ్స్‌ సంస్థ భానుజ, హెడ్స్‌ సంస్థ విజయకుమార్‌, డిప్యూటీ డీఎంహెచఓ రామసుబ్బారావు, డెమోలు ఉమాపతి, గంగాధర్‌, చంద్రశేఖర్‌రెడ్డి, రామచంద్ర, శ్రీకాంత, కిరణ్‌ పాల్గొన్నారు.



Updated Date - 2021-12-03T05:23:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising