పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సన్మానం
ABN, First Publish Date - 2021-07-01T06:19:15+05:30
పదవీ విరమణ ప్రతి ఉద్యోగికీ సహజమన, పదవీ విరమణ రోజే బెనిఫిట్స్ వారికి అం దాల్సిన బెని ఫిట్స్ అందజేశామని వైస్‌చాన్సలర్ రామకృ ష్ణారెడ్డి పేర్కొన్నారు.
అనంతపురం,జూన30 : పదవీ విరమణ ప్రతి ఉద్యోగికీ సహజమన, పదవీ విరమణ రోజే బెనిఫిట్స్ వారికి అం దాల్సిన బెని ఫిట్స్ అందజేశామని వైస్‌చాన్సలర్ రామకృ ష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇదే ఒరవడి కొనసాగాలన్నారు. ఎస్కే యూలో పదవీ విరమణ చేసిన రాజనీతిశాస్త్రం ప్రొఫెసర్ ఆనందనాయుడు దంపతులను, బాటనీ విభాగం ప్రొఫెసర్ చింతా సుధాకర్ దంపతులను, కామర్స్ విభాగం ఫ్రొ ఫెసర్ రమణను బుధవారం ఆడిటోరియంలో ఘనంగా సన్మానిం చారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ... పద వీ విరమణ ప్రతి అధ్యాపకుడికి తప్పనిసరని, తన పదవీ కాలంలో చేసిన సేవలు చిరకాలం గుర్తుంటాయన్నారు. కార్యక్రమంలో రెక్టార్ కృష్ణానాయక్, రిజిస్ర్టార్ కృస్ణకుమారి, ప్రిన్సిపాల్ బాలసుబ్రహ్మ ణ్యం, ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతపురం అర్బన : అకడమిక్ ఆడిట్ కార్యాలయంలో పర్యవేక్షకుడిగా పనిచేసిన కాటమయ్య ఉద్యోగ విరమణ సందర్భంగా బుధవారం జేఎనటీయూ సమావేశ భవనంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జేఎనటీయూ వీసీ రంగ జనార్దనతో పాటు రెక్టార్ విజయకుమార్, రిజిస్ర్టార్ శశిధర్ కాటమయ్య దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
అనంతపురం క్రైం : ఎక్సైజ్‌శాఖ ఎస్‌ఐ అశ్వత్థరెడ్డి, సెబ్ ఎస్‌ఐ మస్తానరావ్, ఇద్దరు ఎక్సైజ్ హెడ్‌కానిస్టేబుళ్లు వెంక టే శ్వర్లు, సత్యనారాయణ పదవీ విరమణ సన్మాన కార్యక్ర మాన్ని బుఽధవారం స్థానిక మానినేని గ్రాండ్‌లో ఘనంగా ని ర్వహించారు.ముఖ్య అతిథులుగా సెబ్ అసిస్టెంట్ కమిషనర్ విజయశేఖర్, ఎక్సైజ్ విజిలెన్స అసిస్టెంట్ కమిషనర్ శివప్రసాద్, నోడల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కుమరేశ్వరన హాజరయ్యారు. పదవీ విరమణ ఉద్యోగుల దంపతులను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్ర మం లో ఎక్సైజ్, సెబ్ శాఖలకు చెందిన ఉద్యోగులు అన్నపూర్ణ, నీలకంఠేశ్వరరెడ్డి, గురునాథరెడ్డి, రాజేంద్రప్రసాద్, ప్రతా పరెడ్డి, శ్యాంప్రసాద్, హాసీనా భాను, హిమబిందు, సృజన బాబు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం ప్రెస్‌క్లబ్ : అనంతపురం డివిజనలో పరిధిలోని ఆత్మకూరు మండలం ఒడ్డుపల్లి బీపీఎం హను మంతురెడ్డి, జయలక్ష్మీపురం హంపాపురం బీపీఎం హరినా రాయణ, గార్లదిన్నె మండలం పెనకచర్ల బీపీఎం చిదంబర రెడ్డి, అనంతపురం ప్రధాన తపాల కార్యాలయంలోని పోస్ట్ మ్యాన పీ వెంకటనారాయణ బుధవారం పదవీవిరణ పొం దారు. వారిని ప్రధాన తపాల కార్యాలయంలో ఆ శాఖ సూ పరింటెండెంట్ ఆదినారాయణ ఆధ్వర్యంలో ఘనంగా స న్మానించి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఏఎస్పీ పార్వ తి, దుర్గాప్రసాద్, పోస్ట్‌మాస్టర్ నిర్మల, రాగిణీదేవి, గణేనా యక్, పీఎస్‌ఆర్‌కే ప్రసాద్, నగేష్, ధనుంజయ, రమేష్ గౌడ్, రాఘవేంద్ర గౌడ్ తదితర పోస్టల్ ఉద్యోగులు పాల్గొన్నారు.
అనంతపురంరూరల్: విద్యుత శాఖ పీఆర్ విభాగంలో జూ నియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన శ్రీని వాసులుకు ఘనంగా వీడ్కోలు పలికారు. విద్యుత శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం వీడ్కోలు సభకు ఎస్‌ఈ వరకుమా ర్ హాజరై పుష్పగుచ్చాలు, మెమోంటోతో ఆ యనను సత్కరించారు. ఎస్‌ఏఓ మధుకుమార్, అకౌంట్స్ విభాగం అధికారులు బాలాజీ వెంకటేష్, గంగన్న తదితరులు పాల్గొన్నారు.
రాప్తాడు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆఫీసు సబార్డినేట్‌గా పనిచేస్తున్న సంజీవరాయుడు పదవీ విరమణ కార్యక్రమానికి డిప్యూటీ సీఈఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులందరూ సంజీవరాయుడు దంపతులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. హౌసింగ్ డీఈ కృష్ణారావు, ఎంపీడీఓ సాల్మనరాజ్, తదితరులు పాల్గొన్నారు.
శింగనమల : మండలంలోని సలకం చెరువు సబ్‌స్టేషన లైనమెనగా విధులు నిర్వహిస్తున్న ముబారక్, కేశన్న బుధవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా విద్యుత శాఖ ఏఈలు మహేష్, వెంకటప్రసాద్, సిబ్బంది ముబారక్ కుటుంబసభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ఎస్‌ఈ రమేష్ పదవీవిరమణ
- ఇనచార్జ్‌గా పబ్లిక్‌హెల్త్ ఎస్‌ఈ శ్రీనాథ్
అనంతపురం కార్పొరేషన,జూన30 : అనంతపురం నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్‌ఈ) రమేష్ బుధవారం పదవీవిరమణ పొందారు. ఇనచార్జ్ ఎస్‌ఈగా పబ్లిక్‌హెల్త్ ఎస్‌ఈ శ్రీనాథ్‌ను నియమిస్తూ ఉన్న తాధికారులు ఆదేశాలిచ్చారు. పదవీవిరమణ చెందిన ఎస్‌ఈ రమేష్‌కు వీడ్కోలు సందర్భంగా కా ర్పొరేషన కార్యాలయం లోని కౌన్సిల్‌హాల్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నగర కమిషనర్ పీవీవీఎస్ మూర్తి హాజరై రమేష్ దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి, సెక్రటరీ సంగం శ్రీనివాసులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇద్దరు పారిశుధ్య కార్మికుల పదవీవిరమణ
నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు పీహెచ వర్కర్లు మల్లికార్జున, హనుమంతు బుధవా రం పదవీవిరమణ చెందారు. కార్పొరేషన కార్యాలయంలో నగర కమిషనర్ పీవీవీఎస్ మూర్తి వారిని సన్మానించారు. కార్యక్ర మంలో సెక్రటరీ శ్రీనివాసులు, డీఈ రామ్‌ప్రసాద్, శానిటరీ ఇనస్పెక్టర్ మదన మోహన, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-07-01T06:19:15+05:30 IST