ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితులకు అన్ని సౌకర్యాలతో కూడిన వైద్యం

ABN, First Publish Date - 2021-05-07T06:34:15+05:30

కదిరి ఏరియా వైద్యశాలలో నిరంతరం వైద్యులు పర్యవేక్షణలో కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి పేర్కొన్నారు.

కొవిడ్‌ బాధితులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మెద్దు

-  ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి 

కదిరి, మే 6 : కదిరి ఏరియా వైద్యశాలలో నిరంతరం వైద్యులు పర్యవేక్షణలో కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి పేర్కొన్నారు. గురువా రం ఆయన కదిరి ఏరియా ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహారం, వైద్యం, ఇతర సౌకర్యాలపై ఆరాతీ శారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో కదిరి ఏరియా వైద్యశాలలో సౌక ర్యాలు లేక పోవడంతో కరోనా బాధితులు చనిపోతున్నారంటూ వస్తు న్న వదంతులు నమ్మవద్దన్నారు. కరోనా తో చనిపోయిన వారు 60 సం వత్సరాల నుండి 85 సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారని, వారిలో కూడా బీపీ, షుగర్‌, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారేనన్నా రు. వైద్యశాలలో 100 పడకలకు సరిపడా ఆక్సిజన సౌకర్యం ఉందన్నారు. అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. రాబోవు రోజుల్లో కరోనా బారిన పడిన వారికి సరిపడా బెడ్‌లు కూడా అందుబాటులో ఉంచినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సోషల్‌ మీడియాలో ప్రజలను భయబ్రాంతులకు చేసే పోస్టులు పెట్టిన వారి పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేతో పాటు ఇనచార్జ్‌ సూపరింటెండెంట్‌ నిస్సార్‌ అహమ్మద్‌ , ఆర్డీఓ వెంకటరెడ్డి, డాక్టర్‌ హుస్సేన, డాక్టర్‌ మోహననాయక్‌, డాక్టర్‌ శిరీషా, తహసీల్దార్‌ మారుతిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-07T06:34:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising