ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈదురు గాలులు, వర్షానికి దెబ్బతిన్న పంటలు

ABN, First Publish Date - 2021-04-22T06:17:27+05:30

మండలం మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు కిష్టిపాడు గ్రామానికి చెందిన శంకర్‌, మహబూబ్‌బాషాతోపాటు మరికొంతమంది రైతులు సాగుచేసిన అరటి, ఆకుతోటలు నేలకొరిగాయి. మెరుపులతో కూడిన ఈదురుగాలులతో వర్షం కురుసింది

మోపిడిలో నేలకొరిగిన అరటిచెట్లను చూపుతున్న రైతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మామిడి, అరటి రైతులకు పెద్దఎత్తున నష్టం..

పడిపోయిన విద్యుత స్తంభాలు, ట్రాన్సఫార్మర్లు...

కరెంటు లేక ఇబ్బందిపడ్డ ప్రజలు


పెద్దవడుగూరు, ఏప్రిల్‌ 21: మండలం మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు కిష్టిపాడు గ్రామానికి చెందిన శంకర్‌, మహబూబ్‌బాషాతోపాటు మరికొంతమంది రైతులు సాగుచేసిన అరటి, ఆకుతోటలు నేలకొరిగాయి. మెరుపులతో కూడిన ఈదురుగాలులతో వర్షం కురుసింది. మండలకేంద్రంలోని మహబూబ్‌పీరాకు చెందిన నివాసగృహంపై పిడుగుపడడంతో ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ముప్పాలగుత్తి గ్రామంలో విద్యుతస్తంభాలు నేలకొరిగాయి. దీంతో కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా కొత్తపల్లి గ్రామంలో రైతులు సాగుచేసిన మామిడి పంట ఈదురుగాలులకు నేలకొరిగింది.


పుట్లూరు: మండలంలో ఈదురుగాలులకు పలు గ్రామాల్లో పంటలు నేలకొరిగాయి. మంగళవారం రాత్రి వీచిన గాలులకు అరటి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నేలకొరిగాయి. కడవకల్లు, చింతకుంట, కందికాపుల తదితర గ్రామాల్లోని రైతులకు నష్టం వాటిల్లింది. చేతికి వచ్చేపంట నేలకొరగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. 


ఉరవకొండ: పట్టణంలో బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. సుమారు గంటపాటు ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. టవర్‌క్లాక్‌ కూడలిలో వర్షపునీరు రోడ్డుమీదకు చేరడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. మండలంలోని మోపిడి గ్రామంలో ఈదురు గాలులకు అరటిపంట నేలకొరిగింది. పది రో జుల్లో పంట చేతికొస్తుందనగా చెట్లు నేలకొరిగి రూ.4 లక్షల నష్టం వాటిల్లిందని రైతులు హరి, హనుమంతరాయుడు తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 


శెట్టూరు: మండల పరిధిలోని ముద్దలాపురం గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన గాలివానకు విద్యుత స్తంభాలు, ట్రాన్సఫార్మర్‌, మామిడిచెట్లు నేలకొరిగాయి. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈ వర్షం కారణంగా రైతులు పొలంలో సాగు చేసిన మామిడిచెట్లు, ఏర్పాటు చేసుకున్న ట్రాన్సఫార్మర్‌, విద్యుత స్తంభాలు నేలకొరిగాయి.

Updated Date - 2021-04-22T06:17:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising