ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత

ABN, First Publish Date - 2021-01-17T05:54:37+05:30

రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో తీ వ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, అందుకు ఇటీవల చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమమే ప్రత్యక్ష ఉదాహరణ అని టీడీపీ పొలిట్‌బ్యూరో స భ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు.

మాట్లాడుతున్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ మంత్రి కాలవ


రాయదుర్గం, జనవరి 16: రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో తీ వ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, అందుకు ఇటీవల చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమమే ప్రత్యక్ష ఉదాహరణ అని టీడీపీ పొలిట్‌బ్యూరో స భ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం స్థానికంగా నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆ యన మాట్లాడారు. చాలా గ్రామాల్లో పట్టాలు తీసుకునేందుకు లబ్ధిదారు లు సుముఖత చూపడం లేదన్నారు. గోవిందవాడ, 74 ఉడేగోళం, బీటీ ప్రా జెక్టు లాంటి గ్రామాల్లో ప్రజలు తిరగబడ్డారని, వారికి సర్దిచెప్పే ప్రయత్నం  కూడా అధికార పార్టీ నాయకులు చేయలేకపోతున్నారన్నారు. అదే విధం గా ఇసుక కొరత, పెరిగిన నిత్యవసరాల ధరలు, పేద, మధ్య తరగతి ప్రజ ల్లో జగన ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుతున్నాయన్నారు. గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఇనపుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స పరిహారాలు అందక  రై తులు ఆవేదన చెందుతున్నట్లు పేర్కొన్నారు. పాలన చేతకాని వైసీపీ నా యకులకు మరో ఆరు నెలలు గడిస్తే ప్రజల్లో తిరిగే పరిస్థితి కూడా వుండదన్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు చంద్రబాబు నాయుడు పరిపాలన ను ప్రశంసిస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు.


తెలుగుదేశం పార్టీ అమలు చేసిన చంద్రన్న బీమా, పెళ్లి కానుక, అన్న క్యాంటీన్ల నిర్వహ ణ లాంటి పథకాలు బలహీన వర్గాలు ప్రతి రోజూ గుర్తు చేసుకుంటున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నిత్యం ప్రజల్లో వుంటూ వారి కోసం పోరాడాల్సిన బాధ్యత అందరిపై వుందని గుర్తుచేశారు. గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలపై పోరాటం ఉధృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బండి క్రిష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు నాగళ్లి రాజు, పట్టణ అధ్యక్షుడు పసుపులేటి నాగరాజు, మండల కన్వీనర్లు లాలెప్ప, గిరిమల్లప్ప, బలరామిరెడ్డి, హనుమంతరెడ్డి, మాజీ మార్కెట్‌ యార్డు వైస్‌ ఛైర్మన బంగి శంకర్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన గాజుల వెంకటేశులు, భోజరాజు, రైస్‌మిల్‌ ఆనంద్‌, బొమ్మనహాళ్‌ చలపతి, కాదలూరు మోహన రెడ్డి, మాజీ జడ్పీటీసీ విజయ్‌కుమార్‌, మాజీ ఎంపీపీ పాలయ్య, కాలవ సన్నణ్ణ, కాటా హనుమంతరాయుడు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-17T05:54:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising