ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వం: కాలవ

ABN, First Publish Date - 2021-06-13T06:39:09+05:30

వైసీపీ ప్రభుత్వం రైతుల శ్రమను దోచుకుంటోందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. శనివారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు.

విలేకరులతో మాట్లాడుతున్న కాలవ శ్రీనివాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొమ్మనహాళ్‌, జూన 12 : వైసీపీ ప్రభుత్వం రైతుల శ్రమను దోచుకుంటోందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. శనివారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. ఆరుగాలం శ్రమించి పంటలు పం డించే రైతులకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదని మండిపడ్డారు. వరిధాన్యం కొనుగోలు నుంచి అనలోడ్‌ వ రకు వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు మిల్లర్లతో అవినీతిలో భాగస్వాములై రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతులు ఎన్నో ఒ డిదుడుకుల మధ్య ధాన్యాన్ని మిల్లర్లకు తరలిస్తే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, తిరుపతి, రేణిగుంట ప్రాంతాల్లో వున్న మిల్లర్ల దయాదాక్షిణ్యాలపై అనలోడ్‌ చేయాల్సిన ప రిస్థితి నెలకొందని ఆవేదన చెందారు. అక్కడి మిల్లర్లు ధా న్యం వద్దంటూ బొమ్మనహాళ్‌, కణేకల్లు ప్రాంతాలకు చెం దిన వరిధాన్యం లారీలను ఆపేశారంటే, ఆ ధాన్యం లోడు ఏమి చేయాలని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులుగా వుండి రైతులకు ఏమి చేసినట్లు..? రై తుల శ్రమ దోచుకుని వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ధాన్యం విక్రయించిన రైతులకు ఏ ఒక్కరికి కూడా నగదు జమ కాలేదంటే రైతుకు ఏమి చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లుతోందన్నారు.


కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తరలించిన ధాన్యం బాగాలేదని, మిల్లర్లు ఇష్టమొచ్చినట్లుగా పరుగులు తీస్తూ రైతుల నుంచి డబ్బు డిమాండ్‌ చేస్తున్నారని ఆవేదన చెందారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి, సంబంధిత శాఖా మంత్రులుగా వుంటూ బాధ్యతగా వ్యవహరించడం లేదన్నారు. చిత్తూరు జిల్లాలో వరిధాన్యం లారీలను ఆపివేసినా ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం మిల్లర్లు త్వరగా అనలోడ్‌ చేసుకునేలా ఒత్తిడి తెచ్చి రైతుల ఖాతాలో నగదు జమ అయ్యేలా చూడాలని డిమాండ్‌ చేశా రు. ధాన్యం కొనుగోలు ద్వారా రైతులకు మేలు జరుగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని, లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 

Updated Date - 2021-06-13T06:39:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising