ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జ్ఞానభూమి’ సర్వర్‌ డౌన

ABN, First Publish Date - 2021-03-22T06:44:16+05:30

ఫీజురీయింబర్స్‌ మెంట్‌ నమోదు ప్రక్రియలో ప్రధాన భూమిక పోషిస్తున్న జ్ఞానభూమి పోర్టల్‌ సర్వ ర్‌ సమస్యతో పనిచేయడం లేదు. దీంతో జేఎనటీయూ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జ్ఞానభూమి పోర్టల్‌లో నెల రోజుల నుంచి విద్యార్థుల వివరాలు నమోదు చేస్తున్నా ఫీజురీయింబర్స్‌మెంట్‌ ప్రక్రి య పూర్తికావడంలేదు. సర్వర్‌ సమస్యే ఇం దుకు ప్రధానకారణం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆగిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నమోదు సేవలు.. 

గడువు పొడిగించినా ఫలితం శూన్యం

అనంతపురం అర్బన, మార్చి 21: ఫీజురీయింబర్స్‌ మెంట్‌ నమోదు ప్రక్రియలో ప్రధాన భూమిక పోషిస్తున్న జ్ఞానభూమి పోర్టల్‌ సర్వ ర్‌ సమస్యతో పనిచేయడం లేదు. దీంతో జేఎనటీయూ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జ్ఞానభూమి పోర్టల్‌లో నెల రోజుల నుంచి విద్యార్థుల వివరాలు నమోదు చేస్తున్నా ఫీజురీయింబర్స్‌మెంట్‌ ప్రక్రి య పూర్తికావడంలేదు. సర్వర్‌ సమస్యే ఇం దుకు ప్రధానకారణం. జేఎనటీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ ఏడాది దాదాపు 600 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరందరూ ఫీజురీయిం బర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో బీటెక్‌, ఎంటెక్‌, ఎంసీఏ విద్యార్థులున్నారు. ఈ ప్రక్రియకు కళా శాలలో ప్రత్యేక విభాగం ఏర్పాటుచేశారు. సిబ్బంది రా త్రి పగలు పనిచేస్తున్నా రోజుకు పది మంది విద్యార్థుల వివరాలు కూడా పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయలేకపోతున్నారు. ఈ నెల 20వ తేదీలోపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దరఖా స్తు చేసుకోవాలని ప్రభుత్వం గడువు విధించింది. అయితే 50శాతం మంది విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోకపోవడంతో మరో ఏడు రోజులు అవకాశమిస్తూ 27వ తేదీవరకు గడువు పొడిగించింది. అయితే సర్వర్‌ పనిచేయకపోవడంతో గడువు పొడిగించినా ఫలితంలేదని విద్యార్థులు వాపోతున్నారు.


ఒక్కో విద్యార్థికి అరగంట 

జేఎనటీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ ఏ డాది దాదాపు 600మంది విద్యార్థులు ప్రవేశా లు పొందారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్లూఎస్‌ కేటగిరిల విద్యార్థులు ఫీజురీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు ఆ ధార్‌, రేషన కార్డులు, కుల ధ్రువీకరణ పత్రా లు తదితర వివరాలతో కూడిన డాక్యూమెంట్‌ల ను జ్ఞానభూమి పోర్టల్‌ లో ఆప్‌లోడ్‌ చేయాలి. సర్వర్‌ సక్రమంగా పనిచేస్తే ఒక్కో విద్యార్థి వివరాలను నమోదు చేయడానికి దాదాపు అర గంట సమయం పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సర్వర్‌ కావడంతో డౌన అవుతోందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో జేఎనటీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో రోజుకు 10 నుంచి 15 మంది విద్యార్థుల వివరాలు కూడా జ్ఞానభూ మి పోర్టల్‌లో నమోదు కావడంలేదు. మరోవైపు అన్ని కోర్సులకు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. తరగతులను వదులుకొని గంటల తరబడి ఫీ జురీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తు చేయడానికి విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సర్వర్‌ నిలకడగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Updated Date - 2021-03-22T06:44:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising