ఘనంగా కనకదాస జయంతి
ABN, First Publish Date - 2021-11-23T06:33:54+05:30
భక కనకదాస జయంతిని సో మవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఉరవకొండలోని కురుబ సంఘం కార్యాలయం, కోనాపురంలో చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు.
ఉరవకొండ/కళ్యాణదుర్గం/బొమ్మనహాళ్/గుంతకల్లుటౌన/బ్రహ్మసముద్రం, నవంబరు 22: భక కనకదాస జయంతిని సో మవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఉరవకొండలోని కురుబ సంఘం కార్యాలయం, కోనాపురంలో చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. ఈనెల 28న అనంతపురంలో నిర్వహించే జయంత్యోత్సవాల పోస్టర్లను కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి శివబాల ఆవిష్కరించారు. కళ్యాణదుర్గం మండలం మల్లాపురం, గరుడాపురం గ్రామాల్లో కనకదాస విగ్రహానికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి, కురుబ సంఘం తాలుకా అధ్యక్షుడు దొణస్వామి వేర్వేరుగా నివాళులర్పించా రు. మల్లాపురంలో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు హాజరై నివాళులర్పించారు. బొమ్మనహాళ్ మండలం నేమకల్లు, గోవిందవాడ, కొట్టూరు గ్రామాలలో కనకదాస విగ్రహానికి పూలమాలలు వేసి, అన్నదానం చేశారు. సాయంత్రం కలశాలతో చిత్రపటాన్ని ఊరేగించారు. గుంతకల్లు పట్టణంలోని బీరప్ప సర్కిల్‌లో క నకదాసు యూత, మానవహక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో క నకదాసు జయంతిని నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లిలో కనకదాస, వాల్మీకి జయంతి వేడుకలను జరుపుకున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ కనకదాసు, వాల్మీకి విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం చిత్రపటాన్ని గ్రామంలో ఊరేగించారు. కనకదాస కీర్తనలు ఆదర్శసమాజానికి దోహదపడతాయని వక్తలు పేర్కొన్నారు.
Updated Date - 2021-11-23T06:33:54+05:30 IST