చెత్తతో సంపద తయారీ కేంద్రం నిర్వహణ భేష్ : జడ్పీ సీఈఓ
ABN, First Publish Date - 2021-10-29T05:58:26+05:30
స్థానిక మేజర్ పంచాయతీ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం నిర్వహణ బాగా వుందని జడ్పీసీఈవో భాస్కర్ రెడ్డి పేర్కొన్నా రు.
కణేకల్లు, అక్టోబరు 28: స్థానిక మేజర్ పంచాయతీ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం నిర్వహణ బాగా వుందని జడ్పీసీఈవో భాస్కర్ రెడ్డి పేర్కొన్నా రు. గురువారం ఆయన ఈ కేం ద్రాన్ని పరిశీలించారు. గ్రామం లో తడి, పొడి చెత్త సేకరించే విధానంపై అడిగి తెలుసుకున్నా రు. ఇటీవల చెత్త నుంచి ఎరువు తయారీ చేసి విక్రయించి ఆదాయం పొందినట్లు ఎంపీడీవో విజయభాస్కర్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తులో ఈకేంద్రం లాభాలు ఆర్జించి జిల్లాలో ఆదర్శంగా నిలవాలని సీఈఓ సూచించారు. వారి వెంట ఈవోఆర్డీ గూడెన్న, ఈవో చంద్రశేఖర్ ఉన్నారు.
Updated Date - 2021-10-29T05:58:26+05:30 IST