ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్త పన్నులను వెంటనే ఉపసంహరించుకోవాలి

ABN, First Publish Date - 2021-06-17T06:17:47+05:30

కరోనాతో ప్రజలు అల్లాడుతున్న తరుణంలో బాధ్యతారహితంగా రాష్ట్ర ప్రభుత్వం చెత్త, ఇంటి, మంచినీటికి పెంచిన పన్నులను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, కురుబ సంఘం జిల్లా అధ్యక్షు డు కొనకొండ్ల రాజేష్‌ డిమాండ్‌ చేశారు.

నీలిమా థియేటర్‌ సర్కిల్‌లో ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అనంతపురం క్లాక్‌టవర్‌: కరోనాతో ప్రజలు అల్లాడుతున్న తరుణంలో బాధ్యతారహితంగా రాష్ట్ర ప్రభుత్వం చెత్త, ఇంటి, మంచినీటికి పెంచిన పన్నులను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, కురుబ సంఘం జిల్లా అధ్యక్షు డు కొనకొండ్ల రాజేష్‌ డిమాండ్‌ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు నాయకత్వంలో పన్నుల పెంపునకు నిరసనగా ఽస్థానిక నీలిమా సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కొనకొండ్ల రాజేష్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ముసుగులో ఒక చేత్తో చిల్లర వేస్తూ, మరో చేత్తో ప్రజల నెత్తిన పన్నుల పిడుగులు వేస్తోందని విమర్శించారు. వెంటనే పన్నుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సచివాలయ వార్డు కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు రూపాదేవి, రాష్ట్ర సభ్యులు చిన్ని రంగమ్మ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షప్రధాన కార్యదర్శులు అనంతకుమారి, కొట్టం జయలక్ష్మి, మల్లిక పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-17T06:17:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising