ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదు తరగతులకు.. మూడే గదులు

ABN, First Publish Date - 2021-02-26T06:41:42+05:30

మండలంలోని బూదగవి, వెలిగొండ గ్రామాలలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల అదనపు గదుల నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి.

బూదగవిలో ఆగిపోయిన పాఠశాల భవన నిర్మాణం, అసంపూర్తి గదుల్లోనే చదువుకుంటున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



చెట్ల కిందే విద్యార్థుల చదువులు

వెలిగొండ, బూదగవిలో ఆగిన పాఠశాల నిర్మాణ పనులు


ఉరవకొండ, ఫిబ్రవరి25: మండలంలోని బూదగవి, వెలిగొండ గ్రామాలలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల అదనపు గదుల నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. దీంతో పాఠశాలలో గదుల కొరత కారణంగా చెట్ల కిందనే విద్యనభ్యసించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా గ్రామాలలో రెండేళ్ల క్రితం ఆర్‌ఎమ్‌ఎ్‌సఏ పథకం కింద అదనపు గదుల నిర్మాణం కో సం పనులు చేపట్టారు. రెండేళ్లు గడుస్తున్నా నిర్మాణ పనులు పూర్తి కాలే దు. బూదగవి గ్రామంలో 2012లో ప్రాథమికోన్నత పాఠశాలను అప్‌గ్రేడ్‌ చేస్తూ జిల్లా పరిషత్‌ పాఠశాలగా ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలో 6 నుం చి 10వ తరగతి వరకూ 108 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఐ దు తరగతులకు కేవలం మూడు గదులు మాత్రమే ఉన్నాయి. 2018-19 సంవత్సరంలో అదనపు గదులు నిర్మాణం కోసం రూ.65లక్షలను మంజూ రు చేశారు. నిర్మాణ పనులు రెండేళ్లయినా పూర్తి కాక అర్ధంతరంగా ఆగిపోయాయి. గదుల కొరత కారణంగా అసంపూర్తి భవనంలోనే తరగతులను నిర్వహిస్తున్నారు. 108 మంది విద్యార్థులకు కేవలం రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. విద్యార్థులు బహిర్భూమికి ఆరుబయటకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ కోణంలోనే పనులు ఆగిపోయాయన్న విమర ్శలు వినిపిస్తున్నాయి. అలాగే మండలంలోని వెలిగొండ గ్రామంలో పాఠశాల అదనపు గదుల నిర్మాణం పనులు నిలిచిపోయాయి. ఈ పాఠశాలలో 107మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలో కూడా రెండేళ్ల నుంచి పనులు ఆగిపోయినా పట్టించుకునేవారు కరువయ్యారు. ప లుమార్లు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తిచేసి అదనపు గదులును అందుబాటులోకి తీసుకురావలని కోరుతున్నారు.  

Updated Date - 2021-02-26T06:41:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising