ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ నిబంధనలు పాటించండి

ABN, First Publish Date - 2021-04-13T05:53:54+05:30

కరోనా సెకండ్‌వేవ్‌ను నియంత్రించాలంటే తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని పరిగి తహసీల్దార్‌ సౌజన్యలక్ష్మీ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురం టౌన, ఏప్రిల్‌ 12: కరోనా సెకండ్‌వేవ్‌ను నియంత్రించాలంటే తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని పరిగి తహసీల్దార్‌ సౌజన్యలక్ష్మీ అన్నారు. సోమవారం పరిగిలో కిరాణాషాపులు, ఆటో డ్రైవర్లు, మెడికల్‌ షాపు నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ కోవిడ్‌ నిబంధనలలో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు. కిరాణాషాపుల్లో ఎవరైనా మాస్కులేకుండా వస్తే సరుకులు ఇవ్వరాదన్నారు. మెడికల్‌ షాపులో కూడా ఇదే నిబంధనలు పాటించాలన్నారు. ఆటోలో ప్రతిఒక్కరూ మాస్కు ధరిస్తేనే ఎక్కించుకోవాలన్నారు. లేదంటే ఆటోలను గుర్తించి సీజ్‌ చేస్తామన్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటించనివారిపై పంచాయతీ సిబ్బంది, పోలీసులతో కలిసి జరిమానాలు విధిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామాంజనేయులు, ఎస్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T05:53:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising