ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పథకాల అమలుపై దృష్టి పెట్టాలి

ABN, First Publish Date - 2021-06-23T06:19:46+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు పై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌.. సంబంధిత అధికారులను ఆదేశించారు.

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌


అనంతపురం, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు పై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌.. సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో బీ సీ, మైనార్టీ, సాంఘిక సం క్షేమ శాఖలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌ తదితర శాఖలకు సంబంధించి అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. అర్హులైన ప్రజలకు  సంక్షేమ పథకాలను అందించేందు కు ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లతో సమన్వయం చేసుకుని, ఆయా శాఖల అధికారులు పనిచేయాలన్నా రు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, అర్హులైన వారికి అందజేసేలా పని చేయాలన్నారు. బీసీ, సాంఘిక సంక్షేమశాఖల కింద చేపట్టిన పాఠశాలల నిర్మాణాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో జేసీ గంగాధర్‌ గౌడ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్యతేజ, బీసీ సంక్షేమ డీడీ యుగంధర్‌, సాంఘిక  సంక్షేమశాఖ డీడీ విశ్వమోహన్‌ రెడ్డి, డీటీడబ్ల్యూఓ అన్నాదొర, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహమ్మద్‌ రఫీ, ఆన్‌సెట్‌ సీఈఓ కేశవనాయుడు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈఓ జాకీర్‌ హుస్సేన్‌, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ రసూల్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-06-23T06:19:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising