ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుణాల రెన్యువల్‌ కోసం బారులు తీరిన రైతులు

ABN, First Publish Date - 2021-05-18T06:03:17+05:30

స్థానిక సిండికెట్‌ బ్యాంకు వద్ద రైతులు సోమవారం పంట రుణాల రెన్యువల్‌ కోసం గుంపులు గుంపులుగా చేరుకున్నారు. కొవిడ్‌ నిబంధనలు గాలికి వదిలేశారు.

గుత్తి బ్యాంకు వద్ద గుంపులు గుంపులుగా చేరిన రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ నిబంధనలు గాలికి... 

గుంపులు గుంపులుగా ఎగబడుతున్న వైనం


విడపనకల్లు, మే 17: స్థానిక సిండికెట్‌ బ్యాంకు వద్ద రైతులు సోమవారం పంట రుణాల రెన్యువల్‌ కోసం గుంపులు గుంపులుగా చేరుకున్నారు. కొవిడ్‌ నిబంధనలు గాలికి వదిలేశారు. ఎండను సైతం లెక్క చే యకుండా గంటల కొద్దీ నిలుచున్నారు.  కొవిడ్‌ నిబంధనలతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత బ్యాంకులు బంద్‌ చేయనుండటంతో రైతులు రెన్యువ ల్‌ కోసం క్యూ కట్టారు. రెన్యువల్‌తో పాటు రైతు భరోసా డబ్బులు డ్రా చే సేందుకు వంద సంఖ్యలో తరలివచ్చారు. కనీసం భౌతిక దూరం పాటించలేదు కదా, మాస్కులు కూడా లేకుండా బ్యాంకులకు చేరుకున్నారు. ఇలాగై తే కరోనాను అరికట్టడం ఎవరికి సాధ్యమవుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎటువంటి నిబంధనలు లే కుండా బ్యాంకుల వద్దకు రావటం పలువురు విమర్శలు చేస్తున్నారు. పోలీసులు, బ్యాంక్‌ అధికారులు స్పందించి రైతులకు క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, భౌతిక దూరాన్ని పాటించేలా చర్యలు తేసుకోవాలని కోరుతున్నారు.  రైతులను నియంత్రించక పోతే కరోనా మహమ్మారి ఇంకాస్త విజిృంభించే ప్రమాదం ఉందని ప్రజలు వాపోతున్నారు. బ్యాంకులో పని చేసే ఉద్యోగు లు సైతం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గుంపులు గుంపులుగా వస్తే విధులు నిర్వహించలేమని, క్యూలైనలో రావాలని రైతులను ప్రాధేయ పడుతున్నా ఎవరూ వినిపించుకోవటం లేదని, ఇలాగైతే మేం ఇక్కడ పని చేయలేమంటున్నారు. పోలీస్‌ నియంత్రణ లేకపోవటంతో రైతులు గుంపు లు గుంపులుగా చేరిపోతున్నారు. 


తగ్గని రద్దీ

గుత్తి : పట్టణంలో బ్యాంకుల వద్ద రద్దీ తగ్గడం లేదు. కరోనా కేసులు పెరుగుతున్నా ఎవరూ భౌతిక దూరం పాటించడం లేదు. ఏమాత్రం భ యం లేకుండా బ్యాంకు వద్ద పెద్దఎత్తున గుమికూడుతున్నారు. పట్టణంలో కెనరా బ్యాంకు, సిండికేట్‌ బ్యాంకు, ఆంరఽధా బ్యాంకుల వద్ద  ఖాతాదారులు, రైతులతో కిటకిటలాడుతోంది. బ్యాంకు సిబ్బంది భయంగా విధులు నిర్వహిస్తున్నారు. అధికారులు, పోలీసులు బ్యాంకుల వద్ద రైతులు, ఖాతాదారులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2021-05-18T06:03:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising