ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు కష్టం నేల పాలు..!

ABN, First Publish Date - 2021-10-15T06:21:50+05:30

రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలపాలైంది. ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి సాగుచేసిన పంట తీరా చేతికొచ్చే సమయంలో దెబ్బతిని, రైతుకు తీవ్రనష్టం మిగిల్చింది

తోటలోనే కుళ్లిపోతున్న టమోటాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఎడతెరపిలేని వర్షాలకు దెబ్బతిన్న టమోటా.. పొలాల్లోనే కుళ్లిపోయి తీవ్ర నష్టం

చెన్నేకొత్తపల్లి, అక్టోబరు 14 : రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలపాలైంది. ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి సాగుచేసిన పంట తీరా చేతికొచ్చే సమయంలో దెబ్బతిని, రైతుకు తీవ్రనష్టం మిగిల్చింది. మండలంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు టమోటా పంట పూర్తిగా దె బ్బతింది. వర్షానికి పంట మొత్తం ఒరిగిపోయి పొలంలోనే కాయలు రాలి కుళ్లిపోతున్నాయి. ఈసారి రైతు కష్టానికి తగ్గట్టుగా పంట దిగుబడి బాగానే వచ్చింది. ధర కూడా ఆశాజనకంగానే ఉంది. 15 కేజీల బాక్స్‌ రూ.350 నుంచి రూ.450 వరకు ధర పలుకుతోంది.దీంతో అప్పుల ఊబి నుంచి బయటపడొచ్చనుకున్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి. తమ కళ్లెదుటే పండిన పంట కుళ్లిపోతుంటే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ప్యాధిండి, చెన్నేకొత్తపల్లి, బసినేపల్లి, పులేటిపల్లి తదితర గ్రామాల్లో రైతులు టమోటాను అధికంగా సాగుచేశారు. ఒక్కొక్కరు ఎకరం నుంచి మూడెకరాల వరకు సాగుచేయగా.. రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. వారి శ్రమకు తగ్గట్టుగా పంట దిగుబడి కూడా బాగానే వచ్చింది. తీరా కోతకొచ్చే సమయంలో రోజూ కురుస్తున్న వర్షాలకు పలువురు రైతులు సాగుచేసిన టమోటా పూర్తిగా దెబ్బతింది. ఒకట్రెండు కోతలు కూడా పడకనే తీరా పూర్తిస్థాయిలో పంట అమ్ముకునే సమయంలో వర్షం తమకు తీవ్రనష్టాన్ని మిగిల్చిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. అప్పులు చేసి టమోటా సా గు చేశామనీ, పంట కోతల సమయంలో చేతికందకుండా పోయిందని వాపోయారు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని, తమ పంట నష్టానికి పరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.


Updated Date - 2021-10-15T06:21:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising