ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మామిడి మొక్కల పరిశీలన

ABN, First Publish Date - 2021-09-29T05:58:40+05:30

మండలంలోని దొరిగిల్లు పొలాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రైతులు సాగు చేస్తున్న మా మిడి మొక్కలను పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌, కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన మంగళవారం పరిశీలించారు.

రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌, కమిషనర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొరిగిల్లులో పంచాయతీరాజ్‌ కమిషనర్‌, కలెక్టర్‌ పర్యటన

ముదిగుబ్బ, సెప్టెంబరు 28: మండలంలోని దొరిగిల్లు పొలాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రైతులు సాగు చేస్తున్న మా మిడి మొక్కలను పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌, కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన మంగళవారం పరిశీలించారు. వీరి వెంట జాయింట్‌ కమిషనర్‌ శివప్రసాదవ్‌, స్పెషల్‌ కమిషనర్‌ శాంతిప్రియపాండే ఉన్నారు. అలివేళమ్మ, రామాంజినేయులు, మనోహర్‌ రైతులు నుంచి మామిడి మొక్కల పెంపకం గురించి వివరాల అడిగి తెలుసుకున్నారు. ఇతర పంటలు సాగుచేయాలని రైతులకు సూచించారు. 

 రికార్డుల తనిఖీ: స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్న కమిషనర్‌, కలెక్టర్‌.. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మామిడి మొక్క ల సాగుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. వారి వెంట వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓ సిద్దారెడ్డి, తహసీల్దార్‌ కరుణాకర్‌, ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణయాదవ్‌, మండల కన్వీనర్‌ నారాయణరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, దొరిగిల్లు చంద్ర ఉన్నా రు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మామిడి మొక్కల సాగులో అవినీతికి పాల్పడిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు జైలు పాలైన విషయం తెల్సిందే. దీంతో దొరిగిల్లు గ్రామ పొలాల్లోని మామిడి మొక్కల పరిశీలన, రికార్డుల తనిఖీ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. 


Updated Date - 2021-09-29T05:58:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising