ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముద్దుల మనువరాలితో.. గ్రామీణ వస్త్రధారణలో రఘువీరా

ABN, First Publish Date - 2021-08-18T21:30:10+05:30

అనంతపురం: ఒకప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. ఏపీసీసీ అధ్యక్షుడిగా, పలు శాఖలకు మంత్రిగా పని చేసి.. కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి పేరు తెచ్చుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: ఒకప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. ఏపీసీసీ అధ్యక్షుడిగా, పలు శాఖలకు మంత్రిగా పని చేసి.. కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో అంత బిజీగా గడిపిన మాజీ మంత్రి రఘువీరా రెడ్డి.. ప్రస్తుతం అవన్నీ వదిలేసి ప్రకృతి మధ్య గడుపుతూ వ్యవసాయానికే పూర్తి సమయం కేటాయిస్తున్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురంలో తన పొలం పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. 


గ్రామీణ సంప్రదాయాలను తాను పాటించడమే కాకుండా తన మనువరాలికి కూడా పరిచయం చేస్తున్నారు. తన ఆరో ప్రాణమైన ముద్దుల మనువరాలు సమీరారెడ్డికి గ్రామీణ వస్త్రధారణ చేయించి.. వ్యవసాయరంగంపై తనకున్న మక్కువను మనువరాలితో పంచుకున్నారు. బుధవారం ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో మనువరాలితో సరదాగా గడిపారు. రెండు నెలలుగా స్థానికంగా ఆలయ నిర్మాణాలు, ప్రారంభోత్సవాలు తదితర కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపిన రఘువీరా.. బుధవారం నుంచి మళ్లీ వ్యవసాయంపై దృష్టి పెట్టారు. మనువరాలికి గ్రామీణ నేపథ్యం గురించి తెలియజేయాలనే రఘువీరా తపన.. గ్రామస్తులందరినీ ఆకట్టుకుంది.







Updated Date - 2021-08-18T21:30:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising