ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి

ABN, First Publish Date - 2021-11-28T05:24:36+05:30

వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదు కుని ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం చెల్లించాలని మాజీమంత్రి పల్లెరఘు నాథరెడ్డి డిమాండ్‌ చేశారు.

బుక్కపట్నం మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న పల్లె
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 - మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

బుక్కపట్నం, నవంబరు 27: వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదు కుని ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం చెల్లించాలని మాజీమంత్రి పల్లెరఘు నాథరెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మండల పరిధిలోని చండ్రా యునిపల్లి, గూనిపల్లి, కొత్తకోట, మారాల, పాముదుర్తి, అగ్రహారంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం పల్లె మాట్లాడుతూ..అకాల వర్షాల వల్ల మండల పరిధిలో దాదాపు వందల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రైతులకు పంటచేతికొచ్చే సమ యంలో అకాల వర్షాలవల్ల పూర్తిగా దెబ్బతిందని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే హంద్రీనీవా కాలువ తెగిపో వడంతో  డైట్‌ వద్ద చండ్రాయునిపల్లి, గూనిపల్లి తదితర గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లను ఆయన పరిశీలించారు. అలాగే కొత్తకోట గ్రామంలో దాదాపు 100 కుటుం బాలకు, మారాల గ్రామంలో ఐదు కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పాముదుర్తి గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేయనున్న వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు రూ.50వేలు విరాళాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ మలిరెడ్డి,  సీనియర్‌ నాయకులు రామసాగరం గంగాధర్‌, సామకోటి ఆది నారాయణ, మీసాలమురళి, బొట్టుకిష్టప్ప, ఆంజనేయులు, గోనుగుంట్లహరి, కేశవ, వాజీద్‌ తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసరాల పంపిణీ

పుట్టపర్తి: చిత్రావతి వరదలతో సర్వం కోల్పోయిన పుట్టపర్తి ప్రజలకు వెంగళమ్మచెరువుకు చెందిన ఆదినారాయణరెడ్డి, శ్రీరామిరెడ్డి అందించిన బియ్యాన్ని శనివారం మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి పంపిణీ చేశారు. నగరపంచాయతీ పరిధిలోని సాయినగర్‌, కోటవీధి, బైపాస్‌రోడ్డు, క్రికెట్‌గ్రౌండు, వివేకానందనగర్‌, కర్ణాటకనాగేపల్లికి వెల్లే రోడ్డుప్రాంతాల్లో పంపిణీ చేశారు. ప్రతికుటుంబానికి ఏడుకేజీల వంతున వెయ్యి కుటుంబాలకు బియ్యం పంపిణీ చేసామని దాతలు తెలిపారు. ఈకార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, గంగిరెడ్డి, లక్ష్మన్న, పాపన్న, చీమల నరసిం హుడు, రమణారెడ్డి, శంకరరెడ్డి, మురికి లక్ష్మన్న , చెన్న క్రిష్ణ, శంకర తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-28T05:24:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising