‘ఉపాధి’ అక్రమాలు బట్టబయలు
ABN, First Publish Date - 2021-10-29T06:00:55+05:30
ఉపాధి హామీ పథకం పను ల్లో అక్రమాలను కేంద్ర బృందం సభ్యులు బట్టబయలు చేశారు.
పనుల్లో లొసుగులను గుర్తించిన కేంద్ర బృందం
గుంతకల్లు/వజ్రకరూరు, అక్టోబరు 28: ఉపాధి హామీ పథకం పను ల్లో అక్రమాలను కేంద్ర బృందం సభ్యులు బట్టబయలు చేశారు. గురువా రం వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో కేంద్ర బృందం సభ్యులు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ డైరెక్టర్ అమర్‌నాథ్ ప్రతా్‌పసింగ్, ప్రోగ్రాం ఆఫీసర్ కిరణ్ పాండే, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ చిన్నతాత య్య, జాయింట్ కమిషనర్లు శివప్రసాద్, కల్యాణ్ చక్రవర్తి పర్యటించారు. కొనకొండ్లలో 2018-22 ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన ఉపాధి హామీ పనుల ను పరిశీలించారు. వీరి రాక కోసం జేసీ సిరి, డ్వామా ఆధికారులు కొనకొండ్లకు ముందుగా చేరుకుని తనిఖీ బృంద సభ్యుల కోసం వేచి చూశారు. ఉ దయం 11 గంటలకు గ్రామానికి చేరుకున్న కేంద్ర బృందం అధికారులు మొదట వర్క్‌ఐడీనెంబర్ 71927 అవెన్యూ ప్లాంటేషనను పరిశీలించారు. ఆ ప్లాంటేషన కాపలాదారులతో మాట్లాడారు. మొక్కల చుట్టూ పిచ్చి మొక్క లు లేకుండా చూడాలని, జాగ్రత్తగా సంరక్షించాలన్నారు అవెన్యూ ప్లాంటేషన ఖర్చు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు ఎందుకు పెరిగిందని ఉపాధి అధికారులను ప్రశ్నించారు. అక్కడి నుంచి సుధాకర్ భార్య నాగమణి పొ లంలో డాగౌట్ ఫాండ్‌ను పరిశీలించారు. అంచనా వ్యయం, ఖర్చు చేసిన వ్యయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఫాండ్‌కు కొలతలు వేసి పరిశీలించారు. అనంతరం రాజశేఖర్ రైతు పొలంలో బౌండరీ ట్రెంచ లేకపోవడంతో అఽధికారులను ప్రశ్నించగా.. రైతు ట్రెంచను పూడ్చేశాడని కేంద్ర బృందం సభ్యులకు తెలియజేశారు. అసలు తవ్విన ఆనవాళ్లే కనిపించడం లేదని, ఏమా త్రం ఆనవాళ్లు లేకుండా ఎలా పూడుస్తాడని, మీటరు తవ్వి చూపాలంటూ ఉపాధి సిబ్బందిని బృందం అధికారులు ప్రశ్నించారు. కందకాలు తవ్వనేలేదన్న అభిప్రాయాన్ని తనిఖీ అధికారులు వ్యక్తంచేశారు. రైతు మోహనరావు పొలంలోని డాగౌట్ ఫాండ్‌కు అంచనా వ్యయం కంటే అధికంగా ఎందు కు చెల్లించారని అధికారులను ప్రశ్నించారు. పది నిమిషాల్లో వివరణ ఇ వ్వాలన్నారు. అనంతరం జగనన్న హౌసింగ్ కాలనీలో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులను ప్రశ్నించగా అధికారులు సమాధానం చెప్పడానికి తడబడ్డారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడం, ఎంపీడీఓ, ఉపాధి హామీ అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో తనిఖీ అధికారులు అసహనం వ్యక్తం చేశా రు. అధికారులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఎలా? అంటూ స్థానిక అధికారులను ప్రశ్నించారు. జరగని పనులకు బిల్లుల చెల్లింపులయ్యాయని, చేసి న పనులకు అధిక కొలతలు వేశారని, మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వ హించారని, కనీసం అడిగిన ప్రశ్నలకు తడబడకుండా జవాబు చెప్పలేకపోతున్నారంటూ తనిఖీ బృందం అధికారులు మండల అభివృద్ధి (ఉపాఽధిహా మీ ప్రోగ్రాం) అధికారి, ఉపాధి సిబ్బందిపై అసహనాన్ని వ్యక్తం చేశారు.
మధ్యాహ్నం గ్రామ సచివాయంలో ఉపాధి కూలీలతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్‌ను అడిగిన వెంటనే పను లు కల్పిస్తున్నారా?, బిల్లులు సక్రమంగా అందుతున్నాయా?, బ్యాంకులో డ బ్బుల కోసం క్యూలో అధిక సమయం వేచి ఉంటున్నారా?, జాబ్ కార్డులు నిర్ణీత సమయంలో మంజూరు చేస్తున్నారా?.. అంటూ కూలీలతో అడిగి తె లుసుకున్నారు. వలసల నివారణకే ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్ర వేశపెట్టిందన్నారు. కూలీలు ఉపాధి పనులు ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలన్నారు. కేంద్ర బృందం సభ్యులను మాజీ ఎమెల్సీ శివరామిరెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. కా ర్యక్రమంలో జేసీ సిరి, డ్వామా పీడి వేణుగోపాల్, ఏపీడీలు విజయలక్ష్మి, శైలజ, ఎంపీడీఓ రెహనాబేగం, ఇన్చార్జి ఏపీఓ ప్రభాకర్ పాల్గొన్నారు
Updated Date - 2021-10-29T06:00:55+05:30 IST